Congress Is Finished: కాంగ్రెస్ ఖతమైంది.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్

ఎవరు ఈ ప్రశ్న అడిగింది? అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది. అది ఇప్పటికే ఖతమైంది. ప్రజలు ఆ పార్టీని పట్టించుకోవడమే మానేశారు. వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు. కాంగ్రెస్ అక్కడా (పంజాబ్) లేదు, ఇక్కడా (గుజరాత్) లేదు. గుజరాత్‭లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ఉంటుంది. బీజేపీని ఎక్కడైతే ఓడించాలని ప్రజలు అనుకుంటారో, అక్కడే కాంగ్రెస్ పార్టీని కూడా ఓడించాలని అనుకుంటారు.

Congress Is Finished: కాంగ్రెస్ పార్టీ విమర్శలపై స్పందించమని అడిగితే.. ఆ పార్టీ ఖతమైందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం అహ్మదాబాద్‭లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పంజాబ్‭లోని ఆప్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని.. ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు చేసే అవినీతితో గుజరాత్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల కోసం డబ్బు సమకూర్చేందుకు ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోందని, దీనిపై స్పందనేంటని కేజ్రీవాల్‭ను మీడియా ప్రశ్నించింది.

కేజ్రీవాల్ దీనికి సమాధానమిస్తూ ‘‘ఎవరు ఈ ప్రశ్న అడిగింది? అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది. అది ఇప్పటికే ఖతమైంది. ప్రజలు ఆ పార్టీని పట్టించుకోవడమే మానేశారు. కాంగ్రెస్ అక్కడా (పంజాబ్) లేదు, ఇక్కడా (గుజరాత్) లేదు. గుజరాత్‭లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ఉంటుంది. బీజేపీని ఎక్కడైతే ఓడించాలని ప్రజలు అనుకుంటారో, అక్కడే కాంగ్రెస్ పార్టీని కూడా ఓడించాలని అనుకుంటారు. బీజేపీకి ప్రత్యామ్నాయం ఆప్ మాత్రమే. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేది ఆప్ మాత్రమే’’ అని అన్నారు.

సామాజిక వేత్త మేధా పాట్కర్‭ను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేయాలని తాను అనుకుంటున్నానని కేజ్రీవాల్ తన మనసులోని మాట చెప్పారు. ఇక రాజకీయ ఆరోపణల గురించి కేజ్రీవాల్ స్పందిస్తూ ‘‘నరేంద్రమోదీ తర్వాత సోనియా గాంధీని ప్రధాని చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించాడని చెప్పండి. దీనిపై ఎవరేమంటారో చూడండి’’ అని అన్నారు.

Bharat Jodo Yatra 7th day: తన పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిందన్న రాహుల్ గాంధీ

ట్రెండింగ్ వార్తలు