Congress leader Raj Kumar Singh
Atiq Ahmad killing: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు ఇటీవల మరణించిన విషయం విధితమే. విలేకరుల ముసుగులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పోలీసుల సమక్షంలోనే గన్‌తో ఇద్దరిని కాల్చేశారు. వారి మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతిక్ అహ్మద్ సోదరుల మరణం తరువాత రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది. తాజాగా అతిక్ మహ్మద్ మరణంపై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు చేశాడు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆరేళ్ల పాటు బహిష్కరణకు గురయ్యాడు.
యూపీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ సింగ్ . అతను ప్రయాగ్‌రాజ్‌లో అతిక్ అహ్మద్ సమాది వద్దకు వెళ్లి జాతీయ జెండాను కప్పాడు. అతిక్ అమర్ హై అంటూ నినాదాలు చేశాడు. అంతేకాక.. అతిక్ మంచి రాజకీయ నాయకుడని, అతనికి భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతిక్ అహ్మద్ హత్యకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని, యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. అతిక్ అహ్మద్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అతనిపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరణతో పాటు పార్టీ అభ్యర్థిత్వాన్ని కూడా వెనక్కి తీసుకుంది. రాజ్ కుమార్ సింగ్ ఇచ్చిన ప్రకటన తన వ్యక్తిగత అభిప్రాయం. దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మిశ్రా పేర్కొన్నాడు. స్థానిక నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మిశ్రా ఈ విషయంపై స్పందిస్తూ.. మా అభ్యర్థి రాజ్ కుమార్ సింగ్ పార్టీ ఆదేశాలను పాటించలేదని అన్నారు. అతిక్ మరణంపై ఎలాంటి అవాంఛనీయ ప్రకటనలు చేయొద్దని కేంద్ర పార్టీ పెద్దలు సూచించినా రాజ్ కుమార్ సింగ్ పార్టీ ఆదేశాలను అతిక్రమించాడని, ఫలితంగా అతన్ని పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించినట్లు తెలిపారు.