Atiq Ahmed Killed: టర్కీలో తయారు చేసిన పిస్టల్‌తో అతిక్ సోదరులపై కాల్పులు.. భారత్‌లో నిషేదమున్నా ఎలా వచ్చింది..? ధర ఎంతంటే?

గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌ల హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారిని హత్యచేసేందుకు నిందితులు వాడిన ఫిస్టల్ టర్కీది. అయితే, ఈ ఫిస్టల్ భారత్ లో నిషేదముంది. దీనిని అక్రమ మార్గంలో భారత్ కు తీసుకొచ్చారు. దీని ధర లక్షల్లో ఉంది.

Atiq Ahmed Killed: టర్కీలో తయారు చేసిన పిస్టల్‌తో అతిక్ సోదరులపై కాల్పులు.. భారత్‌లో నిషేదమున్నా ఎలా వచ్చింది..?  ధర ఎంతంటే?

Atiq Ahmed Killers (Photo _ Google)

Atiq Ahmed Killed: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌ల హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి 10గంటల సమయంలో ప్రయాగ్‌రాజ్‍‌లో వైద్య పరీక్షల కోసం అతీక్ , అష్రాఫ్ లను పోలీసులు తీసుకొచ్చారు. అనంతరం వారు వెళ్తున్న క్రమంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగగా సమాధానం ఇస్తున్న సమయంలో.. మీడియా ముసుగులో వచ్చిన ముగ్గురు నిందితులు అతి దగ్గరగా వారిపై కాల్పులు జరిపారు. బుల్లెట్లు తగలడంతో అతీక్ సోదరులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించారు. కాల్పుల అనంతరం నిందితులు లవ్లేశ్ తివారీ, సన్నీ‌సింగ్, అరుణ్ మౌర్యా పోలీసులకు లొంగిపోయారు.

Atiq Ahmed : బిగ్ బ్రేకింగ్.. యూపీలో కాల్పుల కలకలం.. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హతం

అతీక్, అష్రాఫ్‌లను హత్య చేసేందుకు తీసుకొచ్చిన తుపాకీ వివరాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ తుపాకీని టర్కీ నుంచి తీసుకొచ్చారు. భారత్ లో ఆ తుపాకీని నిషేధించారు. చట్టవిరుద్దంగా దేశంలోకి దీనిని ఎగమతి చేశారు. ఈ తుపాకీ ధర భారీగా ఉంది. సుమారు రూ. 6 నుంచి రూ. 7లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఈ తుపాకీ 18 రౌండ్లు కాల్పుల జరిపి 40 సెకన్ల పాటు కాల్పులు జరుపుతుంది. ఈ తుపాకీని జిగానా ఫిస్టల్ అని పిలుస్తారు.

Atiq Ahmed Story: అతిక్ అహ్మద్ హత్య.. కుప్పకూలిన నేర సామ్రాజ్యం

అతీక్ సోదరులను హత్య చేసిన నిందితులు ముగ్గురు కరుడుగట్టిన నేరస్తులు. వీరు చెడు అలవాట్లకు అలవాటు పడటంతో కుటుంబ సభ్యులు వారిని దూరంగా పెట్టారు. ముగ్గురు నిందితులపై గతంలో అనేక కేసులు ఉన్నాయి. వీరిలో సన్నీ అనే నిందితుడికి గ్యాంగ్‌స్టర్‌లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. అతిక్, అష్రాఫ్ హత్యాకండ తరువాత సీఎం యోగి ఆధిత్య నాథ్ లక్నోలోని సీఎం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐదుగురు ఐపీఎస్ అధికారులను ప్రయాగ్ రాజ్ కు పంపాలని నిర్ణయించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఈ అధికారులు పనిచేస్తారు.