Congress Leader: కాంగ్రెస్ లీడర్ జుట్టు పట్టుకుని లాగిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ లీడర్లను తోసేశారు పోలీసులు. యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్‌ను జుట్టు పట్టుకుని లాగుతూ చేయిజేసుకున్నారు. "వాళ్లు నన్ను కొట్టారు. జుట్టు పట్టుకుని లాగారు" అంటూ శ్రీనివాస్ కేకలు పెట్టారు.

Rahul Gandhi

 

 

Congress Leader: ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ లీడర్లను తోసేశారు పోలీసులు. యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్‌ను జుట్టు పట్టుకుని లాగుతూ చేయిజేసుకున్నారు. “వాళ్లు నన్ను కొట్టారు. జుట్టు పట్టుకుని లాగారు” అంటూ శ్రీనివాస్ కేకలు పెట్టారు.

అంతకంటే ముందు అతని జుట్టు పట్టుకుని లాగి రఫ్‌గా పోలీస్ హ్యాండిల్ చేసిన వీడియోను కాంగ్రెస్ లీడర్లు రిలీజ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. “ఆ స్టాఫ్ ఎవరో గుర్తించే పనిలో ఉన్నాం. అతణ్ని గుర్తించిన తర్వాత క్రమశిక్షణాచర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన నిరసనలో పాల్గొన్న పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలు పార్లమెంట్‌ సమీపంలోని ప్రముఖ రహదారిపై గుమిగూడారు.

Read Also: సొంత పార్టీ ఎమ్మెల్యేకే కాంగ్రెస్ వార్నింగ్

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడంతో పాటు ధరల పెరుగుదల, జీఎస్‌టీ, నిరుద్యోగం వంటి ఇతర సమస్యలపై నిరసన తెలిపారు.