Congress Warning: సొంత పార్టీ ఎమ్మెల్యేకే కాంగ్రెస్ వార్నింగ్

కాంగ్రెస్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ముస్లిం ప్రవక్తపై కామెంట్లు చేసి నుపుర్ శర్మ వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. చామ్‌రాజ్‌పేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జ్ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా సోమవారం సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారు.

 

Congress Warning: కాంగ్రెస్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ముస్లిం ప్రవక్తపై కామెంట్లు చేసి నుపుర్ శర్మ వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.

చామ్‌రాజ్‌పేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జ్ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా సోమవారం సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారు.

“మీరు ఇటీవల పబ్లిక్‌గా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసమంజసమైనవి. పార్టీ క్రమశిక్షణ, సిద్ధాంతాలను, హద్దులను అర్థం చేసుకుని, కట్టుబడి ఉండాలని అనుభవజ్ఞులైన కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అసమంజసమైన, స్వచ్ఛంద ప్రకటనలు వివాదాలను సృష్టించడానికి తప్ప ఎవరికీ సహాయపడవు ”అని సుర్జేవాలా సోమవారం తన లేఖలో పేర్కొన్నారు.

Read Also: ప్రభుత్వాలు మారతాయి.. గుర్తు పెట్టుకోండి- పవన్ వార్నింగ్

అసలు జమీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. “నాకు సీఎం కావాలనే కోరిక ఉంది. మా (ముస్లిం) కమ్యూనిటీ (జనాభా) శాతం వొక్కలిగాస్ కంటే ఎక్కువ” అని ఖాన్ స్టేట్మెంట్ ఇచ్చారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి మాట్లాడుతూ.. జమీర్ భాయ్ (ఖాన్)… ఓటు బ్యాంకు పేరుతో బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం చాలా కాలం క్రితం మాట అంటూ ఎద్దేవా చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు