Diamond Studded Gold Crown for Ram Lalla: మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్.. జైలు గోడల మధ్య నుంచి రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో అయోధ్యలోని రామాలయంలోని రాంలాలా (ఉత్తరప్రదేశ్ లో రాముడిని అలా పిలుస్తారు) విగ్రహానికి 101 వజ్రాలు, 11 కేజీల బంగారంతో చేసిన కిరీటాన్ని విరాళంగా ఇవ్వాలని ఆకాంక్షించారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని సుకేష్ జైలు నుంచి లేఖ రాశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధినేతకు సుకేష్ ఈ లేఖ రాశారు.
తన సామర్థ్యం మేరకు విరాళం ఇస్తున్నట్లు దుండగు సుకేష్ లేఖ రాశారు. అతను దానం చేయాలనుకుంటున్న కిరీటం 11 కిలోల 916 క్యారెట్ల బంగారం, 101 వజ్రాలతో తయారు చేశారు. కిరీటంలోని ఒక్కో వజ్రం ఐదు క్యారెట్ల బరువు ఉంటుంది. సుకేష్ లేఖలో ‘‘ఈరోజు మనకు ఏది లభించినా అది శ్రీరాముడి ఆశీస్సుల వల్లనే. అటువంటి పరిస్థితిలో మా చిన్న సహకారం ఈ గొప్ప ఆలయంలో భాగమవుతుంది. ఇది మాకు పెద్ద వరం’’ అని రాసుకొచ్చాడు.