Cool Winds
Cool Winds: కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చలితీవ్రత పెరుగుతూ వస్తుంది. ఉత్తరాధి రాష్ట్రాల నుంచి దేశమంతటా ఉష్ణోగ్రత్తలు పడిపోతున్నాయి. ఢిల్లీలో కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై చలితో చంపేస్తుంది. వారాంతంలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శనివారం కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే గరిష్టంగా 19 డిగ్రీలు మాత్రమే ఉంది. పొగమంచు, చలితో పాటు కాలుష్య తీవ్రత పెరగడంతో ప్రజల ఇబ్బందులు అధికమవుతున్నాయి. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమగిరుల్లో భారీగా హిమపాతం చవిచూస్తుందని రికార్డులు చెబుతున్నాయి.
హిమాలయాల నుంచి వీస్తున్న చల్లటి గాలులతో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉత్తర కశ్మీర్, గుల్‌మార్గ్, పహాల్ గామ్, లద్దాఖ్, లేహ్ ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.
………………………………….: ‘సెలక్టర్లకు కోహ్లీకి ఉన్న సగం అనుభవం కూడా లేదు’
ఏపీలోనూ అదే పరిస్థితి:
ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. విశాఖ జిల్లా చింతపల్లిలో 6.1డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, వంటల మామిడిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత, అరకులోనూ 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. ప్రస్తుతం చలి కాలం సీజన్లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత.
వారం రోజులుగా ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ.. శనివారం ఉదయం రికార్డు స్థాయికి పడిపోయింది. చింతపల్లి ఏజెన్సీలో దట్టమైన మంచు కురుస్తూ ఉండటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. fog lights లేకపోతే వాహనాలు నడపడంకుడా క్లిష్టంగా తయారు అయ్యింది.