Everest Climb Cop
Mount Everest: తల్లికి నివాళి సమర్పించేందుకు ఎవరెస్ట్ అధిరోహించాడో పోలీస్. మే 23 ఉదయం పోలీస్ ఇన్‌స్పెక్టర్ సాంబాజీ గురవ్ నేవీ ముంబై పోలీసులతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించిన మూడో పోలీస్ గా నిలిచాడు. శిఖరాగ్రానికి చేరిన ఆయన.. స్త్రీలను గౌరవించండి అంటూ పోస్టర్ ప్రదర్శించాడు.
2018లో బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన తల్లికి ఈ అచీవ్మెంట్ ను అంకితం చేశాడు. సంగ్లీ జిల్లాకు చెందిన ఆయన.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో ఫస్ట్ ట్రెక్ ను 2017లో పూర్తి చేశాడు. తన తల్లికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేసేందుకు తిరిగి వెళ్లిపోయాడు. రెండు నెలల వరకూ హాస్పిటల్ లో ఉన్న ఆమె.. పోరాడుతూనే తుదిశ్వాస విడిచింది.
నా తల్లికి నివాళి అర్పించేందుకే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాను. ఆమె మార్చి 2018లో బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయింది. ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించలేకపోయాం. అది ముందుగా తెలిసి ఉంటే కాపాడుకోగలిగేవాడ్ని. ఆమె చనిపోయిన రోజే ఎవరెస్ట్ ఎక్కి నివాళి అర్పించాలని అనుకున్నా’ అని గురవ్ అంటున్నారు.
గురవ్ చేసిన ఫీట్ కు.. డీసీపీ సుహైల్ శర్మ, నేవీ ముంబై మాజీ కమిషనర్ సంజయ్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ‘ఏపీఐ సంబాజీ గురవ్ మొంట్ ఎవరెస్టును మే 23న ఉదయం 6గంటల 30నిమిషాలకు అధిరోహించాడు. అతణ్ని చూసి గర్విస్తున్నాం. అతనితో పాటు అతని కుటుంబానికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం’ అని అన్నారు.