Siya Goyal Lie Detector : కేతన్ కేసులో కొత్త ట్విస్ట్.. తోసింది ఎవరో క్లారిటీ లేదు.. సియాకు లై-డిటెక్టర్ పరీక్షే కీలకం..!
Siya Goyal Lie Detector Test : కాబోయే భర్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా గోయల్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి కోరుతూ పూణే పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కేతన్‌ను లోయలోకి ఎవరు తోశారో ఖచ్చితమైన ఆధారాలు లేవని, దర్యాప్తు కోసం ఈ పరీక్ష అవసరమని పోలీసులు చెబుతున్నారు.
- Sreehari A
- Updated on- July 2, 2026 / 04:41 PM IST
Siya Polygraph Test
- కేతన్ కేసు మిస్టరీ.. సియాకు లై డిటెక్టర్ పరీక్ష చేయక తప్పదు
- తోసింది ఎవరు..? కేతన్ కేసులో మిస్టరీ వీడలేదు..
- కేతన్ కేసులో షాకింగ్ టర్న్.. ఆధారాలు లేవంటున్న పుణె పోలీసులు
Siya Goyal Lie Detector : పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్‌కు పుణె పోలీసులు ఇప్పుడు లై డిటెక్టర్ (పాలిగ్రాఫ్) పరీక్ష నిర్వహంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై గురువారం ఉదయం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అనంతరం సియాతో కలిసి ఆమె ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. :
నిందితురాలు సియా గోయల్‌కు లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. భారత్‌లో పాలిగ్రాఫ్ పరీక్ష ఫలితాలను సాక్ష్యంగా అంగీకరించరు. పాలిగ్రాఫ్ పరీక్ష పోలీసులకు దర్యాప్తులో ఒక టూల్ మాత్రమే. కేతన్ ను లోయలోకి ఎవరు తోసేశారో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్షులు గానీ, కచ్చితమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ పరిణామంపై సియా గోయల్ తరఫు లాయర్ విపుల్ దుషింగ్ మాట్లాడుతూ.. పోలీసులు లై డిటెక్టర్ టెస్ట్ అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారని, అయితే ఇలాంటి పరీక్ష చేసేముందు చట్టపరంగా, సాంకేతికంగా కొన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. లై-డిటెక్టర్ పరీక్షకు నిందితుడి సమ్మతి కూడా తప్పనిసరిగా ఉండాలని ఆయన తెలిపారు.
అయితే, కోర్టు అనుమతితో సియా గోయల్, సహ నిందితుడు చేతన్ చౌదరిల వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే, దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలంటే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని పోలీసులు చెబుతున్నారు.
రేపటితో ముగియనున్న సియా-చేతన్ కస్టడీ :
సియా గోయల్, చేతన్ చౌదరిల పోలీసు కస్టడీ జూలై 3తో ముగుస్తుంది. ఇద్దరు నిందితులను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాద్గావ్ కోర్టులో హాజరుపరుస్తారు. సియా తరఫున న్యాయవాది విపుల్ దుషింగ్, చేతన్ తరఫున న్యాయవాది రామ్ షహానీ హాజరుకానున్నారు. పుణె పోలీసులు నిందితుల పోలీసు కస్టడీని పొడిగించాలని కోర్టును కోరే అవకాశం కనిపిస్తోంది. నిందితుల తరఫు లాయర్లు వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరుతున్నారు.
పుణె రూరల్ పోలీసులు దర్యాప్తులో భాగంగా సియా, చేతన్‌ల బట్టలు, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వీటన్నింటినీ లోతుగా పరిశీలిస్తున్నారు. కేతన్ హత్య తర్వాత అతడి మొబైల్ ఫోన్ కొంతకాలం సియా గోయల్ వద్ద ఉందని, ఆ తర్వాత ఆమె అగర్వాల్ ఫ్యామిలీకి అప్పగించిందని కూడా దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు జూలై 1న లోహగడ్ కోటలో సీన్ రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు.
సియా దగ్గర కేతన్ ఫోన్ :
కేతన్ హత్య తర్వాత మొబైల్ ఫోన్ సియా దగ్గర ఉండటంపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఫోన్ లో ఏవైనా ఆధారాలను డిలీట్ చేశారా? అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.
