ప్రభుత్వం నోటీసులు పంపే వరకు పార్కులు, గార్డెన్స్ బంద్

  • Publish Date - March 16, 2020 / 07:34 AM IST

కరోనా వైరస్ భయంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం సూచనల మేరకు శ్రీనగర్‌లోని అన్ని పార్కులు, గార్డెన్‌లు, ప్లే గ్రౌండ్‌లు మూసివేసినట్లు సోమవారం (మార్చి 16, 2020)న శ్రీనగర్, జమ్మూ కశ్మీర్ డెవలప్ మెంట్ కమిషనర్ షాహిద్ చౌదరి తెలిపారు. 

ప్రభుత్వం నుంచి తదుపరి నోటీసులు వచ్చేవరకు పార్కులు, గార్డెన్స్ ను తెరిచే అవకాశం లేదని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. థియేటర్లు, పార్కులు, షాపింగ్ మాల్స్, జిమ్స్, ప‌బ్స్, అన్నీటికి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ వైరస్ ఇప్పటికే 157దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. ఈ వైరస్ కారణంగా రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. అందుకని కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్యలు చేపట్టాయి. అంతేకాదు అమెరికాలోని సీటెల్ నగరంలోని కైజర్ పర్మినెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు సోమవారం ప్రారంభించారు. 

Also Read |  ఇరాన్ టు భారత్ : రాజస్థాన్‌కు 53 మంది భారతీయులు