Corona Effect
Corona Effect: రుతుపవనాలు స్టార్ట్ అయ్యాయి. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. చాలామంది వర్షాలు పడితే కరోనా తగ్గుతుందని అపోహలో ఉన్నారు. కానీ వర్షాల వలన కరోనా ముప్పు అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వర్షంలో తడిస్తే కరోనా విజృంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. వర్షపు నీటిలో తడవడం వలన బాడీలో వేడి పెరిగి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దీని వలన కరోనాను ఎదురుకునే శక్తి లోపిస్తుంది. ఇది చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.
బ్లాక్ ఫంగస్ కూడా దాడి చెయ్యగలదు అంటున్నారు వైద్య నిపుణులు. అందుకే వర్షంలో తడవవద్దు అని సూచిస్తున్నారు. సాధారణ జ్వరం వచ్చినా వర్షపు నీటిలో తడిస్తే జలుబు, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వర్షపు నీటిలో తడిసిన సమయంలో మాస్క్ పైన కరోనా వైరస్ ఉంటే తడి నోరు, ముక్కుల్లోకి పోయి కరోనా సోకె ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వర్షాకాలంలో కరోనా బారినపడే అవకాశం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.