కరోనా కష్టాలు : బస్సులు లేక కాలినడకనే ఊళ్లకు పయనం

కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో జన జీవనం స్తంభించింది. ముఖ్యంగా సాధారణ ప్రజలు, కూలీలు నానా కష్టాలు పడుతున్నారు.

Corona Migrant Workers Lives Become More Miserable Lockdown 29281

migrant-workers:కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో జన జీవనం స్తంభించింది. ముఖ్యంగా సాధారణ ప్రజలు, కూలీలు నానా కష్టాలు పడుతున్నారు.

కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో జన జీవనం స్తంభించింది. ముఖ్యంగా సాధారణ ప్రజలు, కూలీలు నానా కష్టాలు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వలస కార్మికుల జీవితం మరింత దుర్భరంగా మారింది. తినడానికి తిండి లేక…చేయడానికి పనిలేక నానా అగచాట్లు పడుతున్నారు. నగరాల్లో బతకలేక లేరు… సొంతూర్లకు వెళదామంటే రవాణా సౌకర్యం లేక అగచాట్లు పడుతున్నారు వలస కూలీలు, మరోవైపు వలస కూలీలు నగరాలు విడిచి వెళ్లకుండా సహాయం అందించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది.

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి భారతదేశం మొత్తాన్ని లాక్‌డౌన్ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. కానీ…. చాలా మంది రోజు వారీ కూలీలకు ఇది సాధ్యంకాదు. నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణ కార్మికులు తదితర కూలీలంతా పనికోసం కూడళ్లవద్ద గుమికూడడం కనిపిస్తుంటుంది. లాక్‌డౌన్‌తో ఢిల్లీ, నోయిడా తదితర నగరాల్లోని ఆ కూడళ్లలో ఇపుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. జనంతో బిజీగా ఉండే కూడళ్లలో పక్షుల కిలకిలారావాలు వినగలమని ఎప్పుడూ ఊహించలేం

దేశవ్యాప్తంగా కేంద్రం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఢిల్లీలో రోజూ వారీ కూలీలు, చిన్న కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు, తదితర కార్మీకులకు పూట గడవడమే కష్టంగా మారింది. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ ఏదైనా పని దొరుకుతుందన్న ఆశతో కొందరు కూడళ్లలోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిరాశతోనే ఇంటికి వెనుదిరుగుతున్నారు. రోజుకు 600 సంపాదించే కూలీకి పనిలేకపోవడంతో పస్తులుండే పరిస్థితి నెలకొంది. దీంతో
నగరాల్లో బతకడం కష్టమని భావించిన ప్రజలు గ్రామాలకు తరలి వెళ్లిపోతున్నారు.

బస్సులు, రవాణా సౌకర్యం లేకపోవడంతో వేలాదిగా కాలినడకన తమ తమ ఊళ్లకు బయలుదేరారు. 500-1000 కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్కచేయకుండా కాలినడకన పయనమయ్యారు. కరోనా వైరస్‌ కన్నా తమ కుటుంబంతో కలిసి ఉండడానికే వారంతా ఇష్టపడుతున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ సరిహద్దు నుంచి వేలాది సంఖ్యలో యూపీకి తరలివెళ్తున్నారు వలసకూలీలు. కాలినడకన వెళ్తున్న కూలీలను చూసి యూపీ సర్కార్‌లో కదలిక వచ్చింది. వారికి ఇబ్బంది లేకుండా రెండు రోజుల పాటు బస్సులు నడపాలని ఆదేశాలు జారీ చేసింది. కూలీలను వారి వారి స్వగ్రామాలకు చేర్చేందుకు 1000 బస్సులను ఏర్పాటు చేసింది.

ఢిల్లీ సరిహద్దులోని ఘజియాబాద్‌, ఘజీపూర్‌ నుంచి బస్సులు నడుపుతుండడంతో ఒక్కసారిగా జనం కిక్కిరిసిపోయారు. బస్సు ఎక్కడ మిస్సవుతామోనన్న తపన వారిలో కనిపించింది. బస్సులో నిల్చోవడానికి కూడా చోటు లేకపోవడంతో కొందరు బస్సు టాప్‌పైన కూర్చొని ప్రయాణించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో వ్యక్తికి… వ్యక్తికి మధ్య కనీస దూరం పాటించాలి. కానీ ప్రజలు ఇవేమీ పట్టించుకోకపోగా…. అధికార యంత్రాంగం కూడా మిన్నకుండిపోయింది.

కూలీలు పల్లెలకు వలసబాట పట్టడం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. వారిని ఆదుకునేందుకు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కొన్ని సూచనలు చేసింది. వలస కూలీలకు ఆహారం, దుస్తులు, వసతి కల్పించాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. రాష్ట్ర విపత్తు నిధి నుంచి నిధులను  వాడుకోవాలని ఆదేశించింది.