డాక్టర్‌కు కరోనా లక్షణాలు.. చికిత్స ఇవ్వమని చేతులెత్తేసిన 4హాస్పిటళ్లు

ప్రాణాలు కాపాడే డాక్టర్‌కే దిక్కు లేకుండాపోయింది. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని 4హాస్పిటళ్ల చేర్చుకోమంటూ తిరస్కరించారు. ఎట్టకేలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాయిన్ చేసుకున్నప్పటికీ పరిస్థితి చేయి దాటడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. వ్యాధులకు సాధారణ ప్రజలు భయపడుతున్నారంటే ఏం కాకపోవచ్చు. వైద్యులు కూడా వణికిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 49కేసులు నమోదైన మహారాష్ట్రలో ఇదే పరిస్థితి. 

COVID-19పై భయంతో ప్రైవేట్ హాస్పిటళ్లు ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించాయని జిల్లా ఆరోగ్య అధికారులు చెప్పారు. కరోనా లక్షణాలు కనిపించగానే మా హాస్పిటల్‌లో చేర్చుకోమంటూ చేతులెత్తేశారు. అయితే ప్రస్తుతం రోగిగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న డాక్టర్ విదేశాలకు వెళ్లిన చరిత్ర ఏమైనా ఉందా అని విచారిస్తున్నారు. లేదా ఎవరైనా కరోనా పాజిటివ్ పేషెంట్‌కు చికిత్స అందించాడా అనే విషయం తెలుసుకునే పనిలో ఉన్నారు. 

వారం క్రితం కొల్హాపూర్ నుంచి సొంత గ్రామమైన భుసావాల్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి జ్వరంగా ఉంది. బుధవారం రాత్రి జ్వరం పెరుగుతుండటం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. రాత్రి మొత్తం ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండాపోయింది. ముందు ఫిజిషియన్ దగ్గరకు తీసుకెళ్లేసరికి డాక్టర్ అందుబాటులో లేడు. ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ హాస్పిటల్‌కు వెళ్తే అక్కడి డాక్టర్లు అతనికి కరోనా ఉంటే అది హాస్పిటల్ మొత్తం వ్యాపిస్తుందని చేర్చుకునేందుకు నిరాకరించారు. దాంతో రోగిని ఆ కుటుంబం మరో మూడు హాస్పిటళ్లకు తిప్పింది. 

ప్రతి హాస్పిటల్ నిరాకరించింది. ఒకవేళ అతనికి కరోనా ఉంటే ఎలా అని ప్రశ్నించింది. అతను విదేశాలకు కూడా వెళ్లలేదని చెప్పినా పట్టించుకోలేదు. రాత్రంతా ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్ కు తిరుగుతూనే ఉన్నాం. గురువారం ఉదయం 7గంటలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తీసుకువచ్చాం. హెల్త్ కండిషన్ ను బట్టి వెంటిలేటర్ తో చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఉన్న సదుపాయాలకు మించి వైద్య సహాయం అందించాలని మరెక్కడికైనా తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. 

దీంతో ఆ కుటుంబ సభ్యులు.. జిల్లా కలెక్టరును కలిశారు. అదే హాస్పిటల్లో అతనికి సేవలందించాలని ఆదేశాలిచ్చారు. ట్రీట్‌మెంట్ ఆలస్యం కావడంతో వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చిందని.. కరోనా టెస్టులు చేయాల్సిన అవసరం లేదని.. మామూలు రక్త పరీక్షలు నిర్వహించామని వైద్యులు చెప్పారు. ఇంకా అతని ఆరోగ్య పరిస్థితి అలానే ఉండడంతో వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ కొనసాగుతుంది. 

Also Read | కేరళ సీఎం: రూ. 20 వేల కోట్లతో ప్యాకేజీ.. రాష్ట్రమంతటా ఉచిత బియ్యం