ఇండియా ఐసోలేషన్ వార్డుల్లో రోబోల ట్రీట్‌మెంట్

ఇండియాలో మిగిలిన రాష్ట్రాల మాట అటుంచితే కేరళలోనే తొలి కేసు నమోదైంది. వారం రోజుల పాటు ఆ రాష్ట్రాన్ని భయబ్రాంతులకు గురి చేసిన మీదటే మిగిలిన రాష్ట్రాల్లో బయటపడింది. ఈ మహమ్మారిపై యుద్ధం చేసేందుకు కేరళ లేటెస్ట్ టెక్నాలజీ వాడింది. ప్రమాదకరంగా మారిన ఆరోగ్య పరిస్థితుల నుంచి బయటపడేందుకు, రోగుల వద్దకు వెళ్లి మెడిసిన్ అందించేందుకు రోబోలను వాడింది. ఈ టెక్నిక్ నే ఇండియా మొత్తం వాడేందుకు సిద్ధమవుతున్నారు. 

కేరళలోని కొచ్చికి చెందిన అసిమోవ్ రోబోటిక్స్ మూడు చక్రాలతో పనిచేసే రోబోను తయారుచేసింది. ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న కరోనా పేషెంట్లకు మందులు అందించేందుకు, వారిని కలిసి సూచనలు ఇచ్చేందుకు రోబోలను వాడారు. డాక్టర్లు, నర్సుల కొరత ఒకవైపు, మృత్యు భయం మరోవైపు రిస్క్ లు ఎక్కువైపోతాయనే అనుమానం లేకుండా రోబోలతో పనులు పూర్తి చేస్తున్నారు. 

మనుషుల్లా పనిచేసే రోబోలు తయారుచేయడం చాలా కష్టం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మూడు చక్రాలతో పనిచేసే రోబోలు ఖర్చుకు కూడా అనువుగా ఉంటున్నాయి. అని అసిమోవ్ రోబోటిక్స్ సీఈఓ టీ జయకృష్ణన్ అన్నారు. తొలి రోబో తయారుచేయడానికి ఏడుగురు టీం కలిసి కృషి చేసినా 15రోజులు సమయం పట్టింది. ఇక ఇప్పుడు తయారుచేయడానికి ఒక రోబోను ఒక్క రోజులో తయారుచేయగలమంటూ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికారులు. 

ప్రోటోటైప్ రోబోను పూర్తి చేశాం. దీనికి మనిషి రోబోల మాదిరి చేతులు లేకపోయినా.. అవసరమైతే తీసేసే పార్ట్స్ కూడా ఉన్నాయి. రిమోట్ సాయంతో లేదా.. స్వయంగా పనిచేసే ఈ రోబోకు రెండు ట్రేలతో పనిచేస్తుంది. దీని పేరు కర్మి బోట్. ఇందులో మరో ఫీచర్ ఏమిటంటే రోగికి ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్ తో వీడియో కాల్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకమైన ఫీచర్ ఇందులో ఉంది. చైనా, యూరప్,  అమెరికాలో కరోనా పేషెంట్లకు ట్రీట్ చేస్తూ వైద్యులకు కూడా కరోనా సోకిన సందర్భాలు ఉన్నాయి. 

Also Read | కారు ఆపారని రోడ్డుపై హైడ్రామా.. పోలీసుకి రక్తం పూసిన యువతి