మాస్క్ లేకపోతే..కరోనా రావడం పక్కా అంట

  • Publish Date - June 11, 2020 / 01:43 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. ఎంతో మందిని బలి తీసుకొంటోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా..పలువురు మృతి చెందుతున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభణతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ విస్తరించకుండా..సోకకుండా..పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

ఇందులో ప్రధాన పాత్ర మాస్క్ దే ఉంటుందని కుండబద్ధలు కొడుతున్నారు. మాస్క్ పెట్టుకోవడం వల్ల..కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చంటున్నారు. తాజాగా దీనిపై కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం నిపుణులు కూడా ఇదే విధంగా సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా ముఖానికి మాస్క్ ధరించాలని..అప్పుడే కోవిడ్ విజృంభించకుండా ఉంటుందని తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలిన అంశాలు..‘ప్రోసిడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఏ జర్నల్ లో ప్రచురించారు. 

ప్రజలంతా మాస్క్ పెట్టుకోవడాన్ని అలవాటు చేసుకుంటే…సత్ఫలితాలు ఉంటాయని సూచించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే..ఒక్క లాక్ డౌన్ లు మాత్రమే సరిపోదని స్పష్టం చేశారు. తమకు కరోనా సోకలేదని..మాస్క్ పెట్టుకవడం ఎందుకు అనుకోవద్దని..లక్షణాలు లేకపోయినా..ఇంటి వద్ద తయారు చేసుకున్న మాస్క్ లైనా వేసుకోవచ్చంటున్నారు. దీని ద్వారా వైరస్ గణనీయంగా తగ్గిపోతుందన్నారు. మాస్క్ లతో పాటు భౌతిక దూరం, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తే…మహమ్మారిని అదుపు చేయవచ్చన్నారు. అత్యధిక శాతం మాస్క్ లు పెట్టుకున్న సందర్భాల్లో కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు తేలింది. 

Read: ఒంటరిగా కూర్చుని భోజనం చేయటం అలవాటు చేసుకోండి..

ట్రెండింగ్ వార్తలు