వోకల్ ఫర్ లోకల్ నుంచి ప్రపంచ సాయంపై ఆధారపడేలా..భారత్ కు ఏయే దేశం ఏమేం పంపుతుందో తెలుసా

ప్రజల ప్రాణాలతో పాటు,దేశాల ఆర్థికవ్యవస్థలతో కూడా ఆడుకుంది కరోనా మహమ్మారి.

Modi govt ప్రజల ప్రాణాలతో పాటు,దేశాల ఆర్థికవ్యవస్థలతో కూడా ఆడుకుంది కరోనా మహమ్మారి. ఈ చైనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మరణించారు. కరోనా వైరస్ ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవ్యవస్థలపై ఇప్పట్లో కోలుకోలేని దారుణమైన ప్రభావాన్నే చూపింది.

గతేడాది ఆగస్టులో..కరోనాపై పోరలో భాగంగా పీపీఈ కిట్ల దగ్గర నుంచి వెంటిలేటర్ల వరకు దేశీయ తయారీరంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో వోకల్ ఫర్ లోకల్ నినాదమిచ్చిన ప్రధాని మోడీ.. ఇప్పుడు మహమ్మారి రెండో దశ విజృంభణతో దేశపు ఆరోగ్యరక్షణ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో విదేశీ సాయం కోసం డోర్లు తెరవాల్సి వచ్చింది. పదునైన రక్షణాత్మక మలుపు తీసుకున్న ఒక సంవత్సరం కన్నా తక్కువకాలంలోనే మోడీ ప్రభుత్వం కరోనాపై పోరాడేందుకు విదేశీ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇక, సరిహద్దుల్లో మనతో జగడానికి కాలుదువ్వుతున్న చైనా కూడా ఈ సంక్షోభ సమయంలో భారత్ కు సాయమందిస్తామని ప్రకటించింది.

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల నుంచి వెంటిలేటర్ల వరకు చాలా దేశాలు కరోనాపోరాటంలో భారత్ కు సాయం చేస్తున్నాయి. అయితే ఏయే దేశాలు భారత్ కు ఏయే విధంగా సాయం చేస్తున్నాయో చూద్దాం.

అమెరికా : సీరం సంస్థకు వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన ముడి సరుకు,ఆక్సిజన్ ఉత్పత్తి సిస్టమ్స్,రెమ్ డెసివర్ ఇంజెక్షన్లు, ఒక సీడీసీ(Centers for Disease Control and Prevention)స్ట్రైక్ టీమ్.
బ్రిటన్ : మొత్తం 600 పీసుల కీలకమైన వైద్య పరికరాలు,495 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్,120 నాన్-ఇన్వేసివ్ వెంటిలేటర్లు,20మాన్యువల్ వెంటిలేటర్లు.
జర్మనీ : 23మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ఫ్లాంట్లు,120వెంటిలేటర్లు,8కోట్ల KN95 మాస్క్ లు.
ఫ్రాన్స్ : 8 ఆక్సిజన్ జనరేటర్లు(ఒక్కొక్కటి దాదాపు 10ఏళ్ల పాటు 250పడకల ఆస్పత్రికి నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉంది),5కంటెయినర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్,28వెంటిలేటర్లు,200 ఎలక్ట్రిక్ సిరంజి పంప్స్,బ్రీథింగ్ మెషీన్స్,ఐసీయూకి సంబంధించివి.
ఆస్ట్రేలియా : 500 వెంటిలేటర్లు,10లక్షల సర్జికల్ మాస్క్ లు,5లక్షల P2మరియు N95 మాస్క్ లు,1లక్ష గాగుల్స్,1లక్ష జతల గ్లౌజులు,20వేల ఫేస్ ఫీల్డ్స్.
హాంకాంగ్ : 800 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్
థాయిలాండ్ : 4 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు
సింగపూర్ : 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, 4క్రయోజనిక్ ఆక్సిజన్ కంటెయినర్లు,500 BiPAPs
WHO : 4వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు,మొబైల్ ఫీల్డ్ హాస్పిటల్స్,టెస్టింగ్ కు ఉపయోగించే లేబరేటరీ పరికారాలు అందించారు,2600మందికి పైగా డబ్యూహెచ్ వో నిపుణులు ఇప్పటికే దేశంలో పనిచేస్తున్నారు.
సౌదీ అరేబియా& UAE : 80మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్,6క్రయోజనిక్ ఆక్సిజన్ కంటెయినర్లు
యూరోపియన్ యూనియన్ : 365 వెంటిలేటర్లు మరియు ఐర్లాంట్ నుంచి 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్,స్వీడన్ నుంచి 120 వెంటిలేటర్లు,లక్సంబర్గ్ నుంచి 58వెంటిలేటర్లు,రొమేనియా నుంచి 80 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్,బెల్జియం మరియు పోర్చుగల్ నుంచి రెమ్ డెసివర్ ఇంజెక్షన్లు

ట్రెండింగ్ వార్తలు