Coronavirus India: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. నేటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టింది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో గడిచిన 24గంటల్లో దేశంలో లక్షా 636 కరోనా కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి.

Coronavirus Updates India: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టింది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో గడిచిన 24గంటల్లో దేశంలో లక్షా 636 కరోనా కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో 2వేల 427మంది కోవిడ్ కారణంగా చనిపోయారు.

దేశంలో కరోనా మహమ్మారి గ్రాఫ్ నిరంతరం పడిపోతున్నప్పటికీ కోవిడ్ నుంచి మరణించిన వారి సంఖ్య తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో లక్షా 74 వేల 399మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో క్రియాశీల కేసులు తగ్గాయి.

రెండు నెలల తర్వాత దేశంలో తక్కువ కేసులు నమోదవుతూ ఉండగా.. దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. యాక్టివ్‌ కేసులు కూడా 13.98 లక్షలకు పడిపోయాయి.

రాష్ట్రాలవారీగా డేటా విషయానికొస్తే తమిళనాడు రాష్ట్రంలో 20,423కేసులు నమోదు కాగా 434మంది మరణించారు. మహరాష్ట్రలో కేవలం 12,557 కేసులు నమోదు కాగా, మరణాలు మాత్రం 618. కర్ణాటకలో కూడా కేసులు ఇదే స్థాయిలో ఉన్నా మరణాల సంఖ్య 320. ఇక కేరళలో 14,672కేసులు నమోదయ్యాయి. వరుసగా 25వ రోజు, దేశంలో కొత్త కరోనా వైరస్ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి.

దేశంలో కరోనా పరిస్థితి:

కరోనా కేసులు – రెండు కోట్ల 89 లక్షల 9 వేల 975మంది

కోలుకున్నవారు- రెండు కోట్ల71 లక్షలు 59 వేల 180మంది

క్రియాశీల కేసులు – 14 లక్షల 1,609మంది

చనిపోయినవారు- మూడు లక్షలు 49 వేల 186మంది

దేశంలో ఇప్పటివరకు 23 కోట్ల 27 లక్షల 86 వేల 482మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

గత 24 గంటల్లో దేశంలో 13 లక్షల 90 వేల 916 ​​డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు