‘కళ్లముందే నా భార్య కొట్టుకుపోతున్నా కాపాడలేకపోయా’

దేశంలో వరద బీభత్సం ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. పగలంతా ప్రశాంతంగా ఉండి రాత్రి సమయంలోనే కురుస్తున్న వర్షాలు పదుల సంఖ్యలో ప్రాణాలను అంధకారంలో కలిసేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఉత్తర్ భారతదేశంలో వరదల ధాటికి దారుణమైన నష్టం సంభవించింది. పుణెలోని ఓ వ్యక్తి వరదలో తన భార్య కొట్టుకుపోతున్నా నిస్సహాయంగా ఏడుస్తూ ఉండిపోయాడే కానీ, కాపాడలేకపోయాడు. 

పుణెలోని సహకార్ నగర్‌లోని తంగెవాలా కాలనీకి చెందిన సంజయ్ రానె వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ ప్రాంతం చుట్టుపక్కల నీరు చేరి ఉండడంతో బుధవారం రాత్రి కురిసిన వర్షం ప్రవాహాన్ని ఉధృతం చేసింది. లోతట్టు ప్రాంతం కావడంతో నాలుగు గంటల్లో 100మిల్లీమీటర్ల వర్షపాతం వారికి ఉక్కిరిబిక్కిరి కాకుండా చేసింది. 

‘ఒక్కసారిగా ప్రవాహం వేగం పెరిగి నీళ్లు ఇంట్లోకి చొచ్చుకొచ్చాయి. మేమంతా ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాం. ఈ క్రమంలోనే నా భార్య జోత్స్న చూస్తుండగానే కళ్లెదుటే ప్రవాహంలో కొట్టుకుపోయింది. చేతిని అందుకుందామనుకునే లోపే దూరంగా వెళ్లిపోయింది. తన కోసం గాలిస్తుండగా కొద్ది సమయం తర్వాత విగతజీవిగా కనిపించింది. మా కుటుంబానికి ఇదొక షాక్. నా పదేళ్ల కొడుకు వారద్ ఇక ఎప్పటికీ తన తల్లిని చూడలేడు’ అని రానె దుఖిస్తూ చెప్పాడు. 

పుణెలో కురిసిన భారీ వర్షాలకు 800 జంతువులు, 2వేల వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. కట్రాజ్, బిబెవాడీ, పద్మావతి, సహకార్ నగర్ ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.