ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. తబ్లిగీ జమాత్ కు వెళ్లిన ముస్లింలను తాత్కాలికంగా జైళ్లో వేయాలని ఆదేశాలు ఇచ్చారు. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ వేదికగా వేల మంది హాజరుకావడంతో కరోనా వేగవంతంగా వ్యాపించింది. చాలా శాతం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు క్వారంటైన్‌లో ఉంచినా నమోదు శాతం తగ్గడం లేదు.
‘తబ్లిగీ జమాత్ సభ్యులను తాత్కాలికంగా అరెస్టు చేయాలనుకుంటున్నాం. సెక్యూరిటీ కారణాల రీత్యా లాక్‌డౌన్ లో ఉన్నప్పటికీ ఇది తప్పనిసరి. ముఖ్యమంత్రి వారిని తాత్కాలికంగా జైళ్లలో ఉంచాలని ఆర్డర్ ఇచ్చారు’ అని హోం శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీశ్ అవస్థి అన్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 23 తాత్కాలిక జైళ్లుకూడా ఏర్పాటు చేశారు.
భారత్ లో బుధవారం ఉదయం నాటికి 19వేల 984 కరోనాకేసులు నమోదుకాగా 640మంది మృతి చెందారు. 15వేల 474 మందికి ట్రీట్‌మెంట్ అందించగా 3వేల 869 మంది కోలుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 1300కేసులు నమోదైనట్లు సమాచారం. పవిత్ర మాసం రంజాన్ లో ఇబ్బందులు తలెత్తకుండా నిత్యవసరాలు సరఫరా చేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదిత్యనాథ్ ఆదేశాలిచ్చారు.
రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయి చనిపోతే వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలహాబాద్ లో యూనివర్సిటీ ప్రొఫెసర్ తో పాటు 29మందిని అరెస్టు చేశారు. అందులో 16మంది విదేశీ తబ్లిగీ జమాత్ సభ్యులు ఉన్నారు. మొహమ్మద్ షాహిద్ అనే వ్యక్తి ఇండోనేషియన్లకు ఓ మసీదులో నివాసం కల్పించారు.
వారిలో ఒకరిని కొవిడ్-19 ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కు పంపించారు. వేల మంది భారతీయులు, వందల కొద్దీ విదేశీయులు ఈ జమాత్ లో పాల్గొన్నారు. ఈ మీటింగ్ తర్వాతే భారత్ లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 25వేల మంది తబ్లిగీ జమాత్ సభ్యుల్ని పట్టుకోవడానికి దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆపరేషన్ చేపట్టింది ప్రభుత్వం.