Covid 19 Mansukh Mandaviya Tells Officials To Stay Alert, Enhance Surveillance
Covid 4th Wave Alert : భారతదేశంలో కరోనా కేసులు తగ్గిపోయాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌తో కరోనా ఖతమైందిలే అనుకున్న తరుణంలో మరో కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దాంతో చైనాలోని పలు నగరాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. భారత్‌లో మళ్లీ కరోనా విజృంభించే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో కరోనా నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులను చూస్తే అదే పరిస్థితి రాబోతుందనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. స్కూళ్లు తిరిగి తెరవడం, ఆఫీసులకు వెళ్లడం, మాస్క్ నిబంధనలను సడలించడం వంటి కారణాలు కూడా అయి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనంతో రద్దీగా ప్రాంతాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో కరోనా మరింత విజృంభించేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పక్కదేశమైన చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కరోనా కేసులకు సంబంధించి కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల వంటి మూడు అంశాలపై దృష్టి సారించాలని మాండవీయ అధికారులను ఆదేశించారు. ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర మంత్రి మాండవీయ అధికారులను సూచించారు. కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతున్న క్రమంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు. కరోనా నాల్గో వేవ్ ముప్పును ముందుగానే కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నారు.
Covid 19 Mansukh Mandaviya Tells Officials To Stay Alert, Enhance Surveillance
ఆగ్నేయాసియా, చైనా, యూరప్‌ల నుంచి మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నందున దేశవ్యాప్తంగా కోవిడ్-19 నిఘాను తీవ్రతరం చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధికారులను ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన.. మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయాన్ని సమీక్షించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలనే ఆదేశాలను రద్దు చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు.
దేశంలో మంగళవారం 24 గంటల్లో 5,280 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ నెమ్మదిగా విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 1,80,60,93,107 టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా బుధవారం 7,52,818 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు దేశంలో 78.05 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ వెల్లడించింది.
Read Also : India Covid : భారత్‌లో కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే