COVID-19: కవలలకు జన్మనిచ్చిన కొవిడ్ పాజిటివ్ మహిళ
కరోనావైరస్ పాజిటివ్ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. సోమవారం పుట్టిన ఆ పిల్లల ఆరోగ్యం..
- Subhan Ali Shaik
- Updated on- April 20, 2021 / 02:30 PM IST
Covid-19 positive Woman: కరోనావైరస్ పాజిటివ్ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. సోమవారం పుట్టిన ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు వెల్లడించారు. వారికి జరిపిన టెస్టుల్లో కొవిడ్ నెగెటివ్ గా నిర్థారణ అయిందని డా. అరుణ్ శర్మ, మెడికల్ సూపరిండెంట్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్, గాంధీనగర్ చెప్పారు.
పాజిటివ్ అని తెలియడంతో వారిని సిజేరియన్ చేసి బయటకు తీసినట్లు చెప్పారు. గతేడాది జూన్ లో కొవిడ్ 19 ఫెసిలిటీ సెంటర్ గా మారిన తర్వాత ఇదే మొదటి సర్జరీ అని అధికారులు చెప్తున్నారు.
గాంధీనగర్ లో 200 బెడ్లు, 700మంది కొవిడ్ పేషెంట్లతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకూ ఆ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తొలి పేషెంట్ ఈ గర్భిణీ మాత్రమే.
