Covid-19 Update : దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 3,207 కేసులు, 29 మరణాలు

Covid-19 Update : దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. కరోనా కేసుల పెరుగుదల స్వల్పంగా తగ్గినట్టు వెల్లడించింది.

Covid-19 Update : దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. కరోనా కేసుల పెరుగుదల స్వల్పంగా తగ్గినట్టు వెల్లడించింది. గత 24 గంటల్లో సోమవారం (మే 9)న 3,207 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గణాంకాల ప్రకారం.. సోమవారం మొత్తం 3,410 కరోనా రికవరీలు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసులు 20,403గా ఉండగా, గత 24 గంటల్లో కొత్తగా 29 కరోనా మరణాలు నమోదయ్యాయని డేటా వెల్లడించింది.

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం (మే 8)న 1,422 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ తెలిపింది. గత 24 గంటల్లో 1,438 మంది కరోనా రోగులు కోలుకున్నారు. నగరంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి కోలుకున్న వారి సంఖ్య 18,62,136కి చేరుకుంది. నగరంలో ప్రస్తుతం 5,939 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 26,647 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. పాజిటివిటీ రేటు 5.34శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఢిల్లీలో కోవిడ్ మరణాల సంఖ్య 26,179గా ఉంది.

Covid 19 Update India Reports 3,207 Fresh Covid 19 Cases, 29 Deaths In The Last 24 Hours 

దేశ రాజధానిలో ప్రస్తుతం 1,896 కంటైన్‌మెంట్ జోన్‌లు ఉన్నాయి. నగరంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద.. 51,761 మంది కరోనా టీకాలను తీసుకున్నారు. ఇప్పటివరకు 3,37,30,034కి మందికి టీకాలు అందాయి. కోవిడ్ -19 కేసులలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. దేశంలో ఒక రోజులో 3,451 కొత్త కేసులు నమోదయ్యాయి, కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,635 కి పెరిగింది. దేశంలో 3,805 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో కరోనా యాక్టివ్ కేసులు 0.05శాతంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కోవిడ్ -19 రికవరీ రేటు 98.74శాతం వద్ద ఉంది. గత 24 గంటల్లో కోవిడ్ -19 కారణంగా దేశంలో 40 మరణాలు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో రోజువారీ పాజిటివిటీ రేటు 0.96శాతంగా ఉంది. వారపు పాజిటివిటీ రేటు 0.83శాతంగా నమోదైంది.

Read Also : Telangana Covid Cases Update : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే..

ట్రెండింగ్ వార్తలు