ప్రధానికి మహిళ ట్వీట్.. రైల్లో 20లీటర్ల పాలు పంపిన మోడీ

20లీటర్ల ఒంటె పాలు ముంబైలో ఉంటున్న కుటుంబం కోసం పంపారు మోడీ తన మూడేళ్ల పాపకు పాలు అందుబాటులో లేవని.. నేరుగా మోడీకి ట్వీట్ చేయడంతో ఏకంగా రైల్వేనే కదిలొచ్చింది. మూడున్నరేళ్ల పాపకు ఆవు, గేదె, మేక పాలు తాగితే అలర్జీ అని.. ఒంటె పాలు తీసుకురావడానికి రవాణా అందుబాటులో లేదని ఆమె చెప్పింది. 

దీనిపై ఐపీఎస్ ఆఫీసర్ అరున్ బోత్రా శనివారం ట్వీట్ చేశారు. ‘శనివారం రాత్రి ముంబైకు రైలులో 20లీటర్ల ఒంటె పాలు పంపాం. ఆ కుటుంబం వారితో పాటు ఇతరులకు కూడా వాటిని పంచాలని కోరుతున్నాం. సీపీటీం తరుణ్ జైన్, నార్త్ వెస్ట్ రైల్వేస్ కు థ్యాంక్స్. కంటైనర్ ను తీసుకెళ్లడానికి ఈ వేళలో ఒప్పుకున్నారు’ అని ట్వీట్ చేశారు. 

అసలు ఆ మహిళ మోడీకి చేసిన ట్వీట్ లో ఏం చెప్పిందంటే.. ‘సర్ నాకు 3.5సంవత్సరాల పాప ఉంది. ఆటిసమ్, ఫుడ్ అలర్జీలతో బాధపడుతుంది. తను కేవలం ఒంటెపాలతోనే బతుకుతుంది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సరిపడ పాలు దొరకడం లేదు. రాజస్థాన్లోని సాద్రిలో ఉన్న మాకు సాయం చేయండి అని ట్వీట్ చేసింది.