×
Ad

Corona Cases In Delhi: ఢిల్లీ, ముంబైల్లో తగ్గిన కరోనా కేసులు

ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ఢిల్లీ, ముంబైలలో కేసులు తగ్గడం ప్రారంభించాయి.

  • Published On : January 21, 2022 / 09:28 PM IST

Corona 11zon (1)

Corona Cases In Delhi: ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ఢిల్లీ, ముంబైలలో కేసులు తగ్గడం ప్రారంభించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10వేల 756 కొత్త కోవిడ్ 19 కేసులు నిర్ధారించబడ్డాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 38 మంది రోగులు మరణించారు. కరోనా సంక్రమణ రేటు 18.04శాతంగా నమోదైంది. 24 గంటల్లో 17వేల 494 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.

అదే సమయంలో ముంబైలో 5వేల 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది రోగులు మరణించారు. అదే సమయంలో, 12వేల 913 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ముంబైలో 14వేల 178కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ముంబై నగరంలో మొత్తం 50వేల 32 నమూనాలను పరీక్షించారు. అంతకుముందు ము మహానగరంలో 6032 కోవిడ్ -19 కేసులు నిర్ధారించబడ్డాయి.

అదే సమయంలో, మంగళవారం 6149, సోమవారం 5956 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత కరోనా వేవ్‌లో, జనవరి 7న గరిష్టంగా 20వేల 971కేసులు నమోదయ్యాయి. రెండవ వేవ్‌లో, గత సంవత్సరం ఏప్రిల్ 3న, గరిష్టంగా 11 వేల 573 కేసులు నిర్ధారించబడ్డాయి. ఢిల్లీలో 13వేల 785 కేసులు నమోదవగా.. జనవరి 13వ తేదీన నగరంలో 28వేల 867కేసులు నమోదయ్యాయి.

రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టడంతో, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) శుక్రవారం ప్రైవేట్ కార్యాలయాలను 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం కరోనావైరస్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని షాపులను తెరవడానికి వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, సరి-బేసి పథకాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.