కేంద్రం గుడ్ న్యూస్: త్వరగా రికవరీ అవుతున్న COVID-19 పేషెంట్లు

  • Publish Date - April 30, 2020 / 11:09 AM IST

COVID-19 పేషెంట్లు రికవరీ శాతం పెరుగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 14రోజులుగా పరిశీలించిన డేటా ఆధారంగా 25.19శాతం మంది కరోనా పాజిటివ్ రోగులు కోలుకున్నారు. ట్రీట్‌మెంట్ పూర్తి అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్లు వివరాల ఆధారంగా దీనిని ప్రకటించారు. 14రోజుల క్రితం 13శాతంగా ఉన్న రికవరీ డేటా గురువారంతో 25.19శాతానికి పెరిగింది. 

మొత్తం 8వేల 324మంది రికవరీ అయినట్లు అధికారిక సమాచారం. భారత్ లో 33వేల 50కరోనా కేసులు నమోదు కాగా వెయ్యి 74మంది మృతి చెందారు.