కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి

  • Publish Date - February 27, 2019 / 05:55 AM IST

జమ్మూకాశ్మీర్ లో షాకింగ్. భారత యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. ఇద్దరు పైలెట్లు చనిపోయారు. రోజువారీ నిఘాగా భాగంగా మిగ్ విమానం గాల్లోకి లేచింది. బుడ్గాం సమీపంలోకి వెళ్లిన వెంటనే మిగ్ విమానం కూలిపోయింది. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు. 

ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఈ ఘటన జరగటం కలకలం రేపింది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ నుంచి కాల్పులు జరుగుతున్నాయి. పాక్ యుద్ధ విమానాలు కూడా చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం ఉన్న ఈ క్రమంలో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ విమానం కూలిపోవటం సంచలనంగా అయ్యింది. 
Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు

ఎలా కూలిపోయిందనేది తెలియరావడం లేదు. విమానం కూలిపోతున్న సమయంలో రక్షించుకోవడానికి ప్యారాచూట్‌‌‌లుంటాయి. వీటిని ఉపయోగించి పైలట్లు సేఫ్ గా కిందకు దిగవచ్చు. అలా జరగకపోవడంతో ఎవరైనా దాడి చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తవుతున్నాయి. సాంకేతికలోపంతోనే కూలిపోవచ్చని తెలుస్తోంది. ఘటనపై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు చేపడుతోంది. భారత ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు పాక్ లోకి వెళ్లి ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసి వచ్చిన 24 గంటల్లోనే ఈ ఘటన జరగటం చర్చనీయాంశం అయ్యింది.

Also Read: రౌడీ ఇన్స్‌పెక్టర్ : నడిరోడ్డుపై వెంటాడి.. వేటాడి కొట్టాడు