Amphan Effect.. శ్రామిక్ రైళ్లు రద్దు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

  • Publish Date - May 20, 2020 / 04:31 AM IST

పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఎంఫాన్ తుఫాన్ ప్రభావం స్టార్ట్ అయ్యింది. ఇవాళ(20 మే 2020) మధ్యాహ్నం సూపర్ సైక్లోన్ ఎంఫాన్ తీరం దాటబోతుంది. ఈ క్రమంలోనే ఎంఫాన్ ప్రభావం ఉండే రెండు రాష్ట్రాల్లో భారీగా ఈదురుగాలు విస్తున్నాయి. ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. 

ఒడిశా తీర ప్రాంతంలో 150కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే చెట్లు కూలిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీగా వీస్తున్న ఈదురుగాలులకు చెట్లు నేలకొరగగా.. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రంగంలోకి దిగి  సహాయ చర్యలు చేపట్టింది. 

తుపాన్ తీరం దాటనున్న పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లాలోని డిఘా దీవుల వద్ద పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా.. డిఘా దీవుల వద్ద సముద్ర పరిస్థితి తీవ్రంగా ఉంది. నేటి సాయంత్రం పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తుపాను తీరం దాటనుండగా.. దాని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ క్రబమంలోనే రెండు రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ ఇవాళ రద్దు చేసింది. మహారాష్ట్ర నుంచి ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

Read: అంపన్ తుపాన్ : పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలపై ప్రభావం