మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. అశోక్ నగర్ లో దళితుడిని కొట్టి చంపారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దళితుడిని ఓ యువకుడు కొట్టి చంపారు.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. అశోక్ నగర్ లో దళితుడిని కొట్టి చంపారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దళితుడిని ఓ యువకుడు కొట్టి చంపారు. అమ్మాయిని వేధించాడంటూ యువకుడిపై దాడి చేశాడు. జై శ్రీరాం అంటూ.. విచక్షణారహితంగా కొట్టాడు. కర్రలతోనూ దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
దారుణంగా కొడుతున్నా స్థానికులు స్పందించలేదు. అందరూ చూస్తున్నా ఎవరూ కూడా ఆ యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. ప్రాణ భయంతో కేకలు పెడుతున్నా మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరించారు. దెబ్బలకు తట్టుకోలేక యువకుడు ఆర్తనాదాలు చేస్తుంటే ప్రజలు చోద్యం చేశారు.
దేశంలో దళితులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. గతంలో దళితులపై దాడి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో మరో దళిత యువకుడిపై దాడి ఘటన కలకలం రేపుతోంది.