అత్తా కోడళ్లంటే బద్ధ శతృవులు..ఆడదానికి ఆడదే శతృవు. అనే మాట సమాజంలో వేళ్లూనుకుపోయింది. కానీ కోడళ్లను కన్నబిడ్డల్లా చూసుకునే అత్తలు. అత్తని కన్నతల్లిలో చూసుకునే కోడళ్లు కూడా ఉన్నారు. అటువంటి అత్తాకోడళ్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. అత్తను అమ్మలా భావించి..ఆమె పాడెను మోసని నలుగురు కోడళ్లు అందరిచేత ప్రశంసలు పొందారు. తమకు కన్నతల్లిగా చూసుకున్న అత్తగారు మృతితో ఆ రుణాన్ని తీర్చుకున్నారు ఆ కోడళ్లు. కన్నీరు మున్నీరుగా విలపిస్తు అత్త పాడె మోసారు. ఇంతకంటే మేము ఏం చేయగం అత్తా..అంటూ కంటికి కడివెడు కన్నీరుగా ఏడ్చారు. చనిపోయిన అత్త పాడె మోసిన నలుగురు కోడళ్ల ఘటన మహారాష్ట్రలో సోమవారం (సెప్టెంబర్ 10)న చోటుచేసుకుంది.
అది మహారాష్ట్రలోని బీద్ జిల్లా. సుందర్‌భాయి దగ్దు నైక్వాడే(83) అనే మహిళ సోమవారం కన్నుమూసింది. ఈమెకు నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్లు, మనువళ్లు, మనుమరాండ్లు ఉన్నారు. సుందర్ భాయి మరణంతో ఆ నలుగురు కోడళ్లు కన్నకూమార్తెల కంటే ఎక్కువగా విలపించారు. తమ అత్త తమను బిడ్డల్లాగా చూసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరుగా ఏడ్చారు కోడళ్లు ఉషా రాధాకిసన్ నాయక్వాడే, మనీషా జలీందర్ నాయక్వాడే, లతా నవనాథ్, మీనా మహీంద్రా నాయక్వాడేలు. అది చూసిన స్థానికులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. కన్నబిడ్డల్లా చూసుకున్న అత్త రుణం ఎలా తీర్చుకోవాలని కోడళ్లు ఆలోచించారు. అత్త పాడే మోసి ఆమె రుణం తీర్చుకోవాలనుకున్న కోడళ్లు నిర్ణయించారు. వారి నిర్ణయం విన్న స్థానికులు ఆశ్చర్యపోయారు.తరువాత వారిని అభినందించారు.
అత్త పాడేను కోడళ్లు మోసి రుణం తీర్చుకుని.. అత్తా కోడళ్ల సంబంధానికి..అనుబంధానికి..అనిర్వసచనీయమనై సరికొత్త అర్థాన్ని చెప్పారు. అది చూసి..స్థానికులంతా అత్తా కోడళ్లంటే ఇలా ఉండాలని అంటూ అభినందించారు.
సుందర్‌భాయి కోరిక మేరకు ఆమె కళ్లను దానం చేశారు.సుందర్‌భాయి భర్త 2013లో మృతి చెందాడు. ఆయన కళ్లను కూడా సుందర్ బాయి దానం చేసారు. మనం చనిపోయిన తరువాత మన కళ్లను దానం చేస్తే మరికొందరికి వెలుగునిచ్చినవాళ్లమవుతామని సుందర్ అత్త చెబుతుండేదని ఆమె పెద్ద మనస్సును కోడళ్లు గుర్తు చేసుకున్నారు. అత్త పాడె మోసిన అత్త అంతిమ యాత్రలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.