‘మేం ఎవరినీ ప్రేమించం..ప్రేమ పెళ్లి చేసుకోం’: ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 ముందు రోజు మహారాష్ట్రలోని అమరావతి పరిధి బాలికలు చేసిన ప్రతిజ్ఞ వైరల్‌గా మారింది. ఓ గర్ల్స్ కాలేజ్ (జూనియర్ కాలేజ్) లో బాలికలతో ఆ స్కూల్ సిబ్బందిలోని ఒకరు వాలంటైన్స్ డే చేయించిన ప్రతిజ్ఞ వైరల్‌గా మారింది. ‘మేము ఎవరినీ ప్రేమించం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని బాలికలతో ఓ వ్యక్తి ప్రతిజ్ఞ చేయించాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
45 సెకన్ల నిడివితో కూడిన ఈ వీడియోను వినోద్ అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఆ రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చిత్ర వాఘ్, బీజేపీ నేత పంకజ ముండే, విద్యా శాఖ మంత్రి వర్ష గైక్వాడ్, స్థానిక ఎమ్మెల్యే ఉదయ్ సామంత్ ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశాడు. దీంతో.. ఈ ఘటనపై బీజేపీ నేత పంకజ ముండే స్పందించారు. చింతూరు ప్రాంతంలోని స్కూల్లో ఈ ఘటన జరిగిందని, ఇది హాస్యాస్పదమని.. కేవలం బాలికలు మాత్రమే ఎందుకు ప్రతిజ్ఞ చేయాలని ఆమె తన ట్వీట్‌లో ప్రశ్నించారు.
students from a girls college forced to take an absurd pledge in Amravati on Valentine’s Day. The students are forced to pledge saying we will not love anyone and will never have a love marriage @Pankajamunde @news24tvchannel @VarshaEGaikwad @ChitraKWagh @meudaysamant pic.twitter.com/by8mV1wPgM
— Vinod Jagdale (@vinodjagdale80) February 14, 2020
వీడియో ప్రతిజ్ఞ సారాంశం ఇలా ఉంది. మా తల్లిదండ్రులు మాపై ఎంతో నమ్మకంతో మమ్మల్ని చదువుకోవటానికి పంపించారు. వారి నమ్మకాన్ని మేము వమ్ము చేయం. ప్రేమ ఊబిలో చిక్కుకోం. ప్రేమ పెళ్లి చేసుకోం. కట్నం కోరినవారిని పెళ్లి చేసుకోం. బలమైన భారత్ కోసం..ఆరోగ్యకరమైన భారత్ కోసం మేము ఈ ప్రమాణం చేస్తున్నాము అంటూ ప్రతిజ్ఞ చేశారు.
కాంగ్రెస్ నాయకుడు, మాజీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దివంగత రామ్ మేఘే స్థాపించిన విదర్భ యూత్ వెల్ఫేర్ సొసైటీ అనే విద్యా సంస్థ నడిపే ఈ కాలేజ్ లో ‘యువతకు ముందు సవాళ్లు’ అనే అంశంపై జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) శిబిరంలో ఉపాధ్యాయులు నిర్వహించిన చర్చలో పాల్గొన్న 100 మంది విద్యార్థుల్లో 40 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కాలేజ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందించే ఈ కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ప్రదీప్ దండే విద్యార్ధినిలతో ఈ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ప్రదీప్ దండే మాట్లాడుతూ..ప్రేమ వివాహాలకు తాము వ్యతిరేకం కాదు..కానీ చదువుకునే అమ్మాయిలు ప్రేమ అనే వ్యామోహంలో పడి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చదువు ఎంత ఇంపార్టెంటో తెలుసుకోలేకపోతున్నారు. ప్రలోభాల్లో చిక్కుకుంటున్నారు. ఎన్నో ఆశలతోఅమ్మాయిలను వారి తల్లిదండ్రులు చదివించుకుంటున్నారు. కానీ అమ్మాయిలు ప్రేమ అంటూ వారు మోసపోతున్నారు. ఆ విషయం వారి అర్థం కావాలి. చిన్నవయస్సుల్లోనే ప్రేమా..పెళ్లి అనుకుంటూ వారి చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని అన్నారు. వారు ప్రేమలో పడకుండా చదువపై దృష్టి పెట్టాలి..తరువాతనే పెళ్లి గురించి ఆలోచించాలి. చిన్నవయస్సులో ప్రేమ వారి భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు. ఎంతో నమ్మకంతో అమ్మాయిలను చదివించేందుకు మా వద్దకు పంపించే తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టటం మా బాధ్యత అందుకే ఈ ప్రతిజ్ఞ చేయించామని తెలిపారు. కానీ వారు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకునే బాధ్యత వారిదే..దానికి తగిన విషయాలను మేము చెబుతామని అన్నారు.
ప్రదీప్ దండే ఆలోచనలతో మీరు ఏకీభవిస్తారా? అని కాలేజ్ ప్రిన్సిపాల్ రాజేంద్ర హవ్రేని ప్రశ్నించగా..ఇది ఒప్పందం కాదు..యువతులకు చదువు..ప్రేమ..పెళ్లి విషయాల పట్ల అవగాహన కల్పించటమేనని తెలిపారు. ప్రస్తుతం విద్యార్ధినుల దృష్టి చదువుపైనే ఉండాలి. తరువాత వారు జీవితంలో స్థిరపడ్డాక..ప్రేమ పెళ్లి విషయాల గురించి ఆలోచించాలి..ఇది వారి మంచి భవిష్యత్తు కోసమేనని స్పష్టంచేశారు కాలేజ్ ప్రిన్సిపల్ రాజేంద్ర హవ్రే. తమను నమ్మి వారి పిల్లలను పంపిస్తున్నారు. వారి చదవు బాధ్యత మాదే అందుకే ఇలా అని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద చర్చనీయాంశంగా మారింది.