Delhi Election 2020 : ఆప్ పార్టీ హవా..బోణీ కొట్టని కాంగ్రెస్

  • Publish Date - February 11, 2020 / 06:06 AM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ హవా కొనసాగుతోంది. బీజేపీ కూడా గతంలో కండే కాస్త పుంజుకుంది. ఆప్ పార్టీ మాత్రం దుమ్ము రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. కానీ ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖాతా తెరవలేదు. బోణీ కొట్టలేదు. కనీసం ఆ పరిస్థితి కూడా లేదు. 

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను..ఇప్పటి వరకూ అందిన సమచారం..ఆరు జిల్లాల్లో హవా కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ 56, బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి. ఎగ్జిట్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. 

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ.. మెజార్టీకి అవసరమై 36 స్థానాలను దాటేసిన ఆప్‌ ఇప్పుడు 56కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బొక్కబోర్లా పడింది. ఇప్పటి వరకూ ఒక్క సీట్  లో కూడా ఆధిక్యంలో లేకుండా పోయింది. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని అయిపోయినట్లేనంటునంటున్నారు విశ్లేషకులు. 

ట్రెండింగ్ వార్తలు