Delhi Budget session from March 21, Kailash Gahlot to present
Delhi Budget: ఈ నెల 21 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇన్ని రోజులు ఆర్థిక మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా, లిక్కర్ పాలసీ స్కాం కేసులో జైలుకు వెళ్లడంతో ఆయన స్థానంలో ఆర్థిక శాఖ బాధ్యతల్ని కైలాష్ గెహ్లాట్ తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కైలాషే ప్రవేశపెట్టనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం వెల్లడించింది.
CM Khattar: డిగ్రీ పూర్తి చేసిన 50 ఏళ్లకు పట్టా అందుకున్న హర్యానా సీఎం
బడ్జెట్ సమావేశాల దృష్ట్యా తనకు కొంత కాలం విచారణల నుంచి ఉపశమనం కావాలని గతంలో సీబీఐని మనీశ్ సిసోడియా కోరారు. దీనికి సీబీఐ సైతం అంగీకరించింది. అయితే దీనికి ఒప్పుకున్న వారం రోజులకే ఉన్నట్లుండి సిసోడియాను అరెస్ట్ చేసింది. కాగా, ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో మరో మంత్రి సత్రేంద్ర జైన్ జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా వీరిద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అయితే ఆర్థిక శాఖను గెహ్లాట్‌కు అప్పగించారు కానీ, సిసోడియా వద్ద ఉన్న అదనపు శాఖలు ప్రణాళిక, పబ్లిక్ వర్క్స్ (పిడబ్ల్యుడి), పవర్, హోమ్, అర్బన్ డెవలప్‌మెంట్, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్, వాటర్ డిపార్ట్‌మెంట్లను ఎవరికీ కేటాయించలేదు.
Tripura: బీజేపీ ఆహ్వానానికి ఓకే అన్న తిప్రా మోతా పార్టీ.. కానీ పొత్తు కుదరదట