Tripura: బీజేపీ ఆహ్వానానికి ఓకే అన్న తిప్రా మోతా పార్టీ.. కానీ పొత్తు కుదరదట

మేము త్రిపుర మూలవాసులం. మా హక్కులను విస్మరించి మీరు త్రిపురను పాలించగలరని మీరు అనుకుంటే, మీరు సమస్యను ఎదుర్కొంటారు. త్రిపురలోని మూలవాసుల రాజ్యాంగ హక్కుల కోసం తిప్రా మోత ఏర్పడింది. రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్న మట్టి కుమారులం మేము. త్రిపుర రాజ్యాంగపరమైన పరిష్కారంపై రాతపూర్వక హామీకి వారు సిద్ధమైతే వారితో కలిసి కూర్చునేందుకు మేం సిద్ధం

Tripura: బీజేపీ ఆహ్వానానికి ఓకే అన్న తిప్రా మోతా పార్టీ.. కానీ పొత్తు కుదరదట

ready for talks with the BJP says Tipra Motha Party

Tripura: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మోత మోగించిన స్థానిక తిప్రా మోతా పార్టీతో చర్చలు చేసేందుకు భారతీయ జనతా పార్టీ ఆహ్వానం పంపింది. తిప్రా మోత లేవనెత్తిన అన్ని డిమాండ్లను చర్చిస్తామని త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరమే బీజేపీ ఈశాన్య రాష్ట్రాల స్ట్రాటజిస్ట్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. అయితే రెండు రోజుల తర్వాత బీజేపీ ఆహ్వానానికి తిప్రా మోత అధినేత ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మన్ ఓకే అన్నారు. కానీ త్రిపురకు రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ప్రయోజనాలను గురించి ‘గౌరవప్రదమైన చర్చలు’ మాత్రమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

CTR Nirmal Kumar: బీజేపీకి షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన ఐటీసెల్ ఇంచార్జ్

ఈ చర్చల ద్వారా తానే పదవి ఆశించడం లేదని, ప్రజలు తమకు ఇచ్చిన తీర్పు మేరకే పని చేస్తామని ఆయన అన్నారు. వాస్తవానికి తిప్రా మోత పార్టీతో పొత్తుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్డీయేలో భాగంగా కలుపుకుపోయే ఆలోచనలో ఉంది. ఆ ప్రయత్నాలకు ప్రద్యోత్ బ్రేక్ వేశారు. తాను ఎన్డీయేలో కలవబోనని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయమై ఆయన ఆదివారం స్పందిస్తూ ‘‘మాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటన విన్నాను. వారు మమ్మల్ని గౌరవంగా పిలిస్తే, మేము వారితో చర్చలకు కూర్చుంటాము. కానీ ఏ పదవి ఆశించడం లేదు. త్రిపురకు రాజ్యాంగపరమైన పరిష్కారం కోసం మాత్రమే వారితో మాట్లాడుతాం” అని దెబ్బర్మన్ అన్నారు.

BS Yediyurappa: తిరిగి తిరిగి మళ్లీ యడియూరప్ప వెనకకే వస్తున్న బీజేపీ

“మేము త్రిపుర మూలవాసులం. మా హక్కులను విస్మరించి మీరు త్రిపురను పాలించగలరని మీరు అనుకుంటే, మీరు సమస్యను ఎదుర్కొంటారు. త్రిపురలోని మూలవాసుల రాజ్యాంగ హక్కుల కోసం తిప్రా మోత ఏర్పడింది. రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్న మట్టి కుమారులం మేము. త్రిపుర రాజ్యాంగపరమైన పరిష్కారంపై రాతపూర్వక హామీకి వారు సిద్ధమైతే వారితో కలిసి కూర్చునేందుకు మేం సిద్ధం. త్రిపుర ప్రజలు మాకు ఓట్లు వేశారు. వారి హక్కులను విస్మరించలేం. మాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు” అని దెబ్బర్మన్ పేర్కొన్నారు.

Manish Sisodia: జైల్లో సిసోడియాకు వేధింపులు.. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు.. సీబీఐపై ఆప్ ఆరోపణ

60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో తిప్రా మోత పార్టీ 13 స్థానాలు గెలుచుకుంది. రెండేళ్ల క్రితమే ఏర్పడిన ఈ పార్టీ.. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఇన్న స్థానాలను సాధించడంపై ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. బీజేపీతో కనుక చేతులు కలపకపోతే రాష్ట్ర అసెంబ్లీలో తిప్రానే విపక్ష పార్టీగా ఉండనుంది. అయితే ఆ స్థానాన్ని తిప్రా స్వీకరిస్తుందా, లేదంటే బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వంలో చేరుతుందా అనేది చూడాలి.