Covid-19తో బిజీగా మారిన స్మశానాలు

  • Publish Date - June 13, 2020 / 12:20 PM IST

మూడు అంబులెన్సులు పంజాబీ బాగ్ స్మశానం వద్ద ఆగి ఉన్నాయి. అందులో 6శవాలు ఉన్నాయి. కొవిడ్ 19 రోగుల మృతదేహాలు కావడంతో చనిపోయిన వారిని చూసేందుకు కూడా అనుమతించలేదు అధికారులు. దీంతో స్మశానం బయటనే బంధువులు గంటల కొద్దీ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ ప్రదేశం చుట్టూ పీపీఈ కిట్లు ధరించి చాలా మంది నిరీక్షిస్తూనే ఉన్నారు. 

బంధువల సమక్షంలో జరిగే అంత్యక్రియలు సెక్యురిటీ గార్డులు, హెల్త్ కేర్ స్టాఫ్ లు ఫేస్ షీల్డ్ లు, మాస్క్ లు, గ్లౌజులు ధరించి ముగించారు. ఆ తంతు పూర్తి అయిన తర్వాత శ్మశానం విడిచి వెళ్తున్న ఒక మృతుని కొడుకు ప్రేమ్ బహదూర్ ఇలా అన్నారు. ‘వాళ్లు నాలుగు శవాలను అంబులెన్స్ లో తీసుకొచ్చారు. అంతేకాకుండా వీలైనంత త్వరగా వాటిని కాల్చేయాలని అనుకున్నారు. 

ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కరోనా రోగుల అంత్యక్రియలు ముగించడం కోసమే వాడుతున్నారు. కెపాసిటీకి మించి శవాలు వస్తుండటంతో ఇతర సదుపాయాలపై కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. ఆదేశాలనుసారం రోజుకు ఈ స్మశానంలో 95 అంత్యక్రియలు పూర్తి చేయాలి. దానిని ఇప్పుడు 360కు పెంచారు. దానికి అనుగుణంగానే ఏయే హాస్పిటల్ డెడ్ బాడీస్ కూడా ఇక్కడకు రావాలో ముందుగానే నిర్ణయించారు. 

మిగిలిన స్మశానాల వద్దా ఇదే పరిస్థితి. నిగమ్‌బోధ్ ఘాట్ వద్ద ఇలాగే బిజీగా ఉంది వాతావరణం. లోక్ నాయక్ హాస్పిటల్ నుంచి మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలు సమయంలో రెండు వాహనాల్లో మూడు డెడ్ బాడీస్ వచ్చాయి. వీలైనంత త్వరగా వాటిని దహనం చేసేశారు. ఒక్కోసారి అంబులెన్స్ లో 6మృతదేహాలు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని వ్యాన్ డ్రైవర్ శివం ఠాకూర్ చెప్తున్నాడు. 

చాలా మంది కుటుంబాలకు చెందిన వారి అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఇక్కడ రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందే. సోషల్ డిస్టెన్సింగ్ తో పాటు మాస్క్ లు ధరించి స్మశానాలకు వచ్చి అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ ఉండి వెళ్లిపోతుంటారు కుటుంబీకులు.