CBI Raids: చిక్కుల్లో ఢిల్లీ ఉప ముఖ్యంత్రి సిసోడియా.. సీబీఐ లిస్టులో ఏ-1

120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం సిసోడియా పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చినట్లు సీబీఐ పేర్కొంది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు కూడా ఉంది. గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు, విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది.

CBI Raids: మద్యం స్కాంలో సీబీఐ రైడ్లు ఎదుర్కొన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియా చిక్కుల్లో పడ్డారు. ఈ స్కాంకు సంబంధించి మొత్తం 15 మందితో ఎఫ్‌ఐఆర్‌ రూపొందించిన సీబీఐ.. సిసోడియాను ఏ-1గా చేర్చింది. ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల సీబీఐ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు.

120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం సిసోడియా పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చినట్లు సీబీఐ పేర్కొంది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు కూడా ఉంది. గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు, విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది.

కాగా, సిసోడియా ఆస్తులపై సీబీఐ రైడ్లను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలోనే ఉత్తమ విద్యా శాఖ మంత్రి అని రుజువైన సిసోడియా.. సీబీఐ దాడులకు భయపడరని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘మమ్మల్ని వేధించాలని వారికి పై నుంచి ఆదేశాలు వచ్చాయి. సీబీఐ దాడులు చేయడం మొదటిసారి కాదు. గత ఏడేళ్ళలో మనీశ్ సిసోడియాపై పలుసార్లు దాడులు చేసింది. ఆయనపై పలు నకిలీ కేసులు బనాయించారు. నాపై, సత్యేందర్ జైన్ పై, కైలాశ్ గహ్లోత్ పై కూడా దాడులు జరిగాయి. కానీ, మా వద్ద ఏమీ లభించలేదు’’ అని కేజ్రావాల్ అన్నారు.

Ex MLA Rajan Tiwary: 20 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే.. నేపాల్ బార్డర్‭లో అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు