‘ఈరోజు పోరాడితే రేపు గెలుస్తాం’..ఓటమిని ఒప్పుకోను: అల్కాలాంబ 

  • Publish Date - February 11, 2020 / 09:00 AM IST

ఢిల్లీలోని చాందినీ చౌక్ అసెంబ్లీ స్థానం నుంచి ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి అల్కాలాంబ.. ఓటమిని ఒప్పుకోనని..ఫలితాల్ని మాత్రమే తాను స్వీకరిస్తానని, ఓటమిని కాదని అల్కాలంబ ట్వీట్ చేశారు. 2015లో  ఆప్ తరపున పోటీ చేసిన అల్కాలాంబ 18వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత ఆప్ తో విభేదాలు ఏర్పడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ 2020లో పోటీ చేసి ఘోరంగా  ఓటమిపాలయ్యారు.

ఈ ఎన్నికల్లో కేవలం 1200 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో పూర్తి లెక్కింపు ముగియక ముందే అల్కాలంబ ఓటమి ఖరారైపోయింది. అయితే తాను ఓటమిని ఒప్పుకోనని అల్కా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల పరిణామాల్ని అంగీకరిస్తున్నాను. కానీ ఓటమిని కాదు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఢిల్లీలో సరికొత్త నాయకత్వం అవసరం.

ఈ కొత్త నాయకత్వంలో ఢిల్లీ ప్రజల కోసం సుదీర్ఘ పోరాటాలు చేయాలి’’ అని ట్వీట్ చేసిన అల్కాలంబ.. చివరలో ‘ఈరోజు పోరాడితే రేపు గెలుస్తాం’ అనే నినాదం ఇచ్చారు.
ప్రస్తుతం ఎన్నికల ఫలితాల ప్రకారం ఆప్ 58 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా..బీజేపీ 12 స్థానాల్లో ఉండగా కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ కాంగ్రెస్ బోణీ కాదు కదా చెప్పుకోదగిన ఓట్ల శాతాన్ని కూడా సాధించలేకపోయింది. కాగా..ఈ ఎన్నికల్లో ఆప్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.