జూన్ 10 నుంచి లిక్కర్ మరింత చీఫ్ ధరలకే అందుబాటులోకి రానుంది. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ తర్వాత మద్యంపై భారీగా అంటే 70శాతం అదనపు ధరలను వసూలు చేసింది ఢిల్లీ గవర్నమెంట్. ఈ మేరకు పెంచిన ధరలను జూన్ 10 నుంచి తగ్గిస్తున్నట్లు AAP ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ధరలు తగ్గినప్పటికీ Value Added Tax (VAT)ను 20శాతం నుంచి 25శాతానికి పెంచినట్లు అధికారులు వెల్లడించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలోనే ఎమ్మార్పీ ధరల కంటే అదనంగా స్పెషల్ కరోనా ఫీజు పేరిట వసూలు చేసేందుకు ఢిల్లీ గవర్నమెంట్ సిద్ధమైంది.
ఇలా చేయడం ద్వారా గవర్నమెంట్ కు అదనపు ఆధాయం వచ్చి చేరుతుందని భావించారు. కరోనావైరస్ కారణంగా ఎదుర్కొన్న భారీ సంక్షోభాన్ని ఇలా పూడ్చాలని భావించారు. ఇదే పద్ధతిని దేశంలోని మిగతా రాష్ట్రాలు ఫాలో అయ్యాయి.