ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సమయం ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సమయం ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేసేందుకు అవకాశమివ్వాలని 11 మంది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు కోర్టు వారి అభ్యర్థనను కొట్టిపారేసింది.
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారం (ఫిబ్రవరి 6, 2020) సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు 2020, ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనుండగా ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు.
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఆప్ ముమ్మరంగా ప్రచారం చేశాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఆయా పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఆకర్షణీయమైన పథకాలు, హామీలు ఇచ్చారు. ఢిల్లీ పీఠం ఎక్కాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆప్ ఢిల్లీలో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది.