×
Ad

Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్, కవితకు భారీ ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన కోర్టు

Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

Arvind Kejriwal, Kavitha

  • ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం
  • కేజ్రీవాల్, కవిత సహా 23మందికి భారీ ఊరట
  • క్లీన్‌చిట్ ఇచ్చిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు

Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి సిసోదియాతోపాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలకు క్లీన్‌చిట్ ఇచ్చింది. వారిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నింటిని కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో 23 మంది నిందితులు తప్పు చేశారని సాక్షాదారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

Also Read : Andhrapradesh : ఏపీలో దారుణం.. పెళ్లైన కొన్ని గంటల్లోనే వరుడి దారుణ హత్య..

సీబీఐ దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. మనీష్ సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సీబీఐ సమర్పించలేక పోయిందని కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ విషయంలో, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు మోపడం చట్టపరమైన ప్రమాణాలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. మౌలిక ఆధారాలు లేకుండా కుట్రలో ఆయన పాత్రను నిర్ధారించడం సాధ్యం కాదని తీర్పులో స్పష్టం చేసింది.

ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఊహాగానాల ఆధారంగా ఈ కేసులో కుట్ర జరిగిందని సీబీఐ అధికారులు ఆరోపించారని పేర్కొన్న న్యాయస్థానం.. దానిని నిరూపించడంలో విఫలమయ్యారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ పాలసీపై ముగ్గురు న్యాయ నిపుణుల అభిప్రాయాలు తమ కేసుకు మద్దతు ఇస్తున్నాయని గతంలో సీబీఐ చేసిన ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఇదిలాఉంటే తాజా కోర్టు తీర్పును సవాలుచేస్తూ సీబీఐ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

కోర్టు తాజా తీర్పుతో దేశ రాజధానిలో మద్యం అమ్మకాలకు కొత్త విధానాన్ని రూపొందించడంలో అవినీతి జరిగిందనే ఆరోపణల కేసులో ఆప్‌కు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. కోర్టు తీర్పు అనంతరం అరవింద్ కేజ్రీవాల్ సెంట్రల్ ఢిల్లీలోని కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. సత్యం చివరికి గెలుస్తుందని ఎప్పుడూ చెబుతూనే ఉన్నా.. సత్యం మావైపై ఉంది. ఇంటి నుంచి బయటకు లాగి జైల్లో పడేశారని, మాపై బురద జల్లారు అంటూ కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిన  23 మంది వీరే..
Arvind Kejriwal
Manish Sisodia
K. Kavitha
Sanjay Singh
Vijay Nair
Sameer Mahendru
Abhishek Boinpally
Amit Arora
Dinesh Arora
Sarath Chandra Reddy
Magunta Srinivasulu Reddy
Magunta Raghav Reddy
Arun Ramchandra Pillai
Buchi Babu Gorantla
Benoy Babu
Gautam Malhotra
Rajesh Joshi
Pankaj Bhatnagar
C. Arvind
Yogesh Gupta
Sandeep Gupta
Chanpreet Singh
Ashish Mathur