అందమైన కొరియన్ అమ్మాయిలకు చికాకు తెప్పించిన యువకుడు.. చివరకు అయిష్టంగా యువతి హగ్‌.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వీడియో

ఆ తర్వాత ఆ యువకుడు “నీవు చాలా క్యూట్.. ఐ లవ్ యూ” అని అన్నాడు.

viral video

Viral Video: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఇద్దరు కొరియా యువతులకు ఓ యువకుడు చిరాకు తెప్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుడిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఆ ఇద్దరు యువతుల దగ్గరకు వెళ్లి.. “హలో, ఎక్స్‌క్యూజ్‌ మీ, మై డ్రీమ్, పంచ్… పంచ్…” అని ఆ యువకుడు అన్నాడు. ఫిస్ట్ బంప్ కోరుతున్నట్లు పిడికిలి చూపించాడు. దీంతో ఆ యువతుల్లో ఒకరు “మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారా?” అని అడిగింది. ఆ యువకుడు “ఫిస్ట్ బంప్” అని అన్నాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు యువతులు ఫిస్ట్ బంప్ ఇచ్చారు.

Also Read: మీరంతా 24 గంటల్లో అమెరికాకు తిరిగి వచ్చేయండి.. అంతేకాదు..: టెక్‌ కంపెనీలు సంచలన ప్రకటన

ఆ యువకుడు ఇంతటితో ఆగలేదు. తనకు హగ్ ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆ యువతుల్లో ఒకరికి అతడి తీరు ఆగ్రహం తెప్పించింది. మరో యువతి అయిష్టంగానే హగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ యువకుడు “నీవు చాలా క్యూట్.. ఐ లవ్ యూ” అని అన్నాడు.

ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. “సారీ ఫ్రమ్ ఇండియా” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొరియన్ యువతులకు ఇబ్బంది పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.