Delhi Air Pollution : ఢిల్లీలో పెరిగిన గాలి కాలుష్యం… అన్ని స్కూళ్లు క్లోజ్.. ఇకపై ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే!

Delhi Air Pollution : ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు మాత్రమే జరుగుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ట్వీట్ చేశారు.

Delhi Primary Schools To Shift To Online Classes Amid Rising Pollution

Delhi Air Pollution : దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు మాత్రమే జరుగుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ట్వీట్ చేశారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. తదుపరి సూచనల వరకు ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నడుస్తాయని సీఎం అతిషి వెల్లడించారు.

ఢిల్లీలో గ్రేప్-3 ఆంక్షలు :
ఢిల్లీలో గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయికి చేరుకుంది. ఢిల్లీ ఏక్యూఐ స్థాయి నవంబర్ 14న 400 దాటింది. ఈ స్థాయి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ నవంబర్ 15 నుంచి గ్రేప్-3ని అమలు చేయాలని నిర్ణయించింది. దీని కారణంగా, కాలుష్యం అదుపులోకి వచ్చేవరకు నిర్మాణ సంబంధిత పనులు నిలిచిపోనున్నాయి. భవనాల కూల్చివేత, మైనింగ్‌కు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోతాయి.

5వ తరగతి వరకు ఆన్‌లైన్ తరగతులు :
ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని, ఆన్‌లైన్ మోడ్‌లో తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాలుష్య స్థాయిలు పెరుగుతున్నందున తదుపరి సూచనల వరకు ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభిస్తామని ఢిల్లీ సీఎం అతిషి గురువారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

గత రెండు రోజులుగా ఢిల్లీలో కాలుష్య స్థాయి అత్యంత దారుణమైన స్థాయి నుంచి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ వార్ రూమ్‌లో పర్యావరణ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించింది. సమావేశం అనంతరం పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ గ్రూప్-3 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

ఢిల్లీ పర్యావరణ మంత్రి ఏమన్నారంటే? :
ఆంక్షలను కఠినంగా అమలు చేయడం ద్వారా ఢిల్లీ కాలుష్యాన్ని అరికట్టడంలో విజయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గోపాల్ రాయ్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు వేసవి కార్యాచరణ ప్రణాళిక, శీతాకాల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించాల్సి వస్తే.. కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది.

Read Also : Tollywood Actress : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..