దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5వేలు దాటింది. 160 మందిని బలితీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా తీవ్రత
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5వేలు దాటింది. 160 మందిని బలితీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. ఢిల్లీ పోలీస్ విభాగాన్ని కూడా కరోనా తాకింది. పోలీసు విభాగానికి సంబంధించి తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.(కరోనా వైరస్ ఆకారంలో కారు తయారుచేసిన హైదరాబాదీ.. ..)
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్‌ఐ)కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. గత వారం ఇన్‌స్పెక్టర్‌కు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించగా ఏప్రిల్ 7న కరోనా పాజిటివ్ అని ఫలితం వచ్చింది. దీంతో సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ కుటుంబాన్ని వైద్య అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇక ఈ పోలీసు కుటుంబం నివసించిన కాలనీతో పాటు విధులు నిర్వహించిన ప్రాంతంలో పోలీసులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు ఢిల్లీ పోలీసులు. నగరంలోని రోడ్లపై విధులు నిర్వర్తించిన ట్రాఫిక్ పోలీస్ కు కరోనా సోకడం కలకలం రేపుతోంది.
* ప్రపంచంలో 209కి చేరిన కరోనా ప్రభావిత దేశాల సంఖ్య
* ప్రపంచవ్యాప్తంగా 14లక్షల 30వేల కరోనా కేసులు.. 81వేల 715 మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3లక్షలు
* అత్యధికంగా అమెరికా, స్పెయిన్, ఇటలీలో కేసులు నమోదు
* యూరప్ దేశాల్లో కరోనా పంజా
* బ్రెజిల్, స్వీడన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు, మరణాలు
* అమెరికాలో 4 లక్షలకు పైగా కరోనా కేసులు, 12వేల 716 మరణాలు
* స్పెయిన్ లో లక్షా 40వేల కేసులు, 14వేలకు పైగా మరణాలు
* ఇటలీలో లక్షా 30వేల కేసులు, 17వేలకు పైగా మరణాలు
* ఫ్రాన్స్ లో నిన్న ఒక్కరోజే 1,417 మంది, అమెరికాలో నిన్న ఒక్కరోజే 1,845 మంది మరణం
* అమెరికాలో నిన్న ఒక్కరోజే 27వేలకుపైగా కేసులు నమోదు
* భారత దేశంలో 5వేలు దాటిన కరోనా కేసులు, 169 మరణాలు
* కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినవారు 463 మంది
* అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో కరోనా కేసులు నమోదు
* మహారాష్ట్రలో 1018 కేసులు, 64 మరణాలు
* కేరళలో 336 కేసులు, రెండు మరణాలు
* తెలంగాణలో 404 కరోనా కేసులు, 11 మరణాలు
* తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య 45
* ఏపీలో 329 కరోనా కేసులు, 4 మరణాలు