కరోనాకి భయపడొద్దు, సాధారణ ఫ్లూ లాంటిదే, ఢిల్లీలో కొవిడ్ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తొలి బాధితుడు ఇంకా ఏం చెప్పాడంటే..?

  • Publish Date - March 16, 2020 / 05:30 AM IST

కరోనా వైరస్ ఏం భయంలేదు..నేను కోలుకున్నా..అంటున్నారు 45 సంవత్సరాల ఓ బిజినెస్ మెన్. ఈయన ఢిల్లీలో కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజుల తర్వాత రికవరీ అయ్యాడు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఓ జాతీయ ఛానెల్‌కు వివరించారు. భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. వంద మందికి పైగా ఈ లక్షణాలున్నట్లు గుర్తించారు.

ప్రస్తుతం వీరికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో 45 సంవత్సరాలుగల బిజినెస్ మెన్‌లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఇతను దేశ రాజధానిలో మొదటి వ్యక్తి.  ఢిల్లీలోని సప్దర్ గంజ్ ఆసుపత్రికి  తరలించి రెండు వారాలుగా చికిత్స అందించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ..భయపడాల్సిన అవసరం లేదని, సాధారణ ఫ్లూ లాంటిదని అభివర్ణించారు.

వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే..బాగుంటుందని సూచించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి..చికిత్స అందించడం వల్ల..ఆరోగ్యం మెరుగైందన్నారు. మరో 14 రోజలు పాటు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించారని తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన వైద్య బృందం చక్కటి సహాయసహకారాలు అందించి ధైర్యం నింపారని కొనియాడారు. తాను 2020, ఫిబ్రవరి 25వ తేదీన యూరప్ నుంచి తిరిగి రావడం జరిగిందని, మరుసటి రోజు తనకు జ్వరం వచ్చిందన్నారు. వైద్యుడి దగ్గరకు వెళ్లగా..గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పడం జరిగిందన్నారు.

See Also | ఏపీలో కరోనా కలకలం.. అనంతపురం, కడప జిల్లాలో ఇద్దరు అనుమానితులు

మూడు రోజుల పాటు మందులు వాడానన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన కోలుకున్నట్లు, కానీ మరలా తిరిగి జ్వరం తిరగతోడినట్లు చెప్పారు. చివరకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నట్లు, అక్కడ కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడం జరిగిందన్నారు. తనను సప్దార్ గంజ్ ఆసుపత్రి వైద్య బృందం తనను చూడటానికి వచ్చిందని, తనకు చాలా ధైర్యం చెప్పారని తెలిపారు.

కేవలం జలుబు, దగ్గు ఉంటుందని, కానీ కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని వారు వివరించినట్లు చెప్పారు. కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో..కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొందని, అందులో భాగంగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తనకు అందులో ఉంచి చికిత్స అందించారన్నారు. ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయని, ప్రైవేటు హాస్పిటల్స్‌కు ధీటుగా ఉన్నాయన్నారు. 

కరోనా వైరస్ కారణంగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని ఢిల్లీ  ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా బాధితుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 110 కేసులు నమోదయ్యాయి. అందులో మహారాష్ట్ర నుంచే అధికంగా ఉన్నాయి. 

Read More : యువకుడిని నగ్నంగా చేసి..యూరిన్ పోస్తూ..పైశాచిక ఆనందం