Delivery Boy Obscene Clips : ఛీ..ఛీ.. మహిళలకు పోర్న్ వీడియోలు పంపిస్తాడు, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తాడు.. డెలివరీ బాయ్ అరెస్ట్

ఈ కామర్స్ సంస్థలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. మహిళలకు పోర్న్ వీడియోలు పంపిస్తాడు. అంతేకాదు వారికి వీడియో కాల్స్ చేసి తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తాడు. ఇదీ అతడి తీరు.

Delivery Boy Obscene Clips : ఛీ..ఛీ.. మహిళలకు పోర్న్ వీడియోలు పంపిస్తాడు, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తాడు.. డెలివరీ బాయ్ అరెస్ట్

Updated On : February 20, 2023 / 12:45 AM IST

Delivery Boy Obscene Clips : కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. తమ చర్యలతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ ఈ కామర్స్ సంస్థ డెలివరీ బాయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి అత్తారింటికి పంపారు.

అతడి పేరు జ్యోతీరామ్ బాబూరావ్ మన్సులే. వయసు 27ఏళ్లు. ఓ ఈ కామర్స్ సంస్థలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. మహిళలకు పోర్న్ వీడియోలు పంపిస్తాడు. అంతేకాదు వారికి వీడియో కాల్స్ చేసి తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తాడు. ఇదీ అతడి తీరు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కామాంధుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Also Read..Delhi: పద్నాలుగేళ్ల బాలికపై తాంత్రికుడి అత్యాచారం.. భూతవైద్యం పేరుతో ఘాతుకం

తన వద్ద నుంచి పార్సిల్స్ అందుకున్న మహిళల ఫోన్ నెంబర్లను జ్యోతీరామ్ తన ఫోన్ లో సేవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన పని ప్రారంభిస్తాడు. ఆ మహిళలకు పోర్న్ వీడియో క్లిప్స్ పంపిస్తాడు. అంతేకాదు వీడియో కాల్స్ చేసి తన ప్రైవేట్ భాగాలు చూపించి రాక్షసానందం పొందుతాడు. మలాడ్ లో నివాసం ఉండే ఓ మహిళకు.. డెలివరీ బాయ్ ఇలానే వీడియోలు పంపి వేధించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

Also Read..Judo Coach Harassment : మూడు రాత్రులు నాతో గడపాలి, నా కోరిక తీర్చాలి.. జూడో కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

పోలీసుల విచారణలో ఆ నీచుడు తన తప్పుని ఒప్పుకున్నాడు. మహిళలకు పోర్న్ వీడియో క్లిప్స్ పంపింది నిజమే అన్నాడు. పుణె, ముంబైకి చెందిన సుమారు 25 మంది మహిళలకు పోర్న్ వీడియో క్లిప్స్ పంపినట్లు తెలిపాడు. పోలీసులు ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. బోరివిల్లి మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ నిందితుడికి పోలీస్ కస్టడీ విధించారు.

 

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.