మోడీ వ్యాఖ్యలకు తృణముల్ స్ట్రాంగ్ కౌంటర్

40మంది తృణముల్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని సోమవారం వెస్ట్ బెంగాల్ లోని శీరంపూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ స్పందించింది. తృణముల్ సీనియర్ లీడర్ డీరక్ ఓబ్రియన్ మోట్లాడుతూ..ఎక్స్ పైరీ బాబు పీఎం..నీ వెనక వచ్చేవాళ్లు ఎవరూ లేరు.ఒక్క కౌన్సిలర్ కూడా రారు.ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారా లేక ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తున్నారా అంటూ మోడీని విమర్శించారు.మోడీ ఎక్స్ పైరీ డేట్ దగ్గర్లో ఉందన్నారు. ఎమ్మెల్యేలపై మోడీ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి తాము ఫిర్యాదు చేయబోతున్నట్లు డీరక్ తెలిపారు.