Yuzvendra Chahal: నెల రోజులు పుట్టింటికి వెళ్తానన్న భార్య.. ఆనందంతో గంతులేసిన క్రికెటర్ చాహల్.. వీడియో వైరల్
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మలు విడిపోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ ధన శ్రీ వర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
- Harishth Thanniru
- Published On : August 23, 2022 / 10:09 PM IST
Dhanashree Verma and Chahal
Yuzvendra Chahal: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మలు విడిపోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. అయితే వీరు గతంలో అలాంటిదేమీలేదని చెప్పినప్పటికీ రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రూమర్స్ కు చెక్ పెడుతూ ధనశ్రీ వర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో మంగళవారం ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోలో చాహల్ చేసిన డ్యాన్స్ కు ధనశ్రీ వర్మ నవ్వులు చిందిస్తోంది. ఈ వీడియోను పోస్టుచేసిన కొద్ది గంటల్లోనే 7.7లక్షల మంది లైక్ చేయగా, దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Crocodile Angry: వామ్మో.. మొసలికి కోపమొచ్చింది.. వ్యక్తిని ఎలా ఉరికించిందో చూడండి.. వీడియో వైరల్
చాహల్, ధనశ్రీలు విడిపోతున్నారంటూ రూమర్లు వచ్చాయి. అయితే వాటిని నమ్మొద్దంటూ వారిద్దరు వేర్వేరుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయినా ఆ రూమర్లకు చెక్ పడలేదు. ఇలాంటి రూమర్స్ కలిచివేస్తున్నాయంటూ చాహల్ ఆవేదనసైతం వ్యక్తం చేశాడు. మా రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ఎలాంటి పుకార్లను నమ్మవద్దని మీ అందరికీ వినయపూర్వకమైన అభ్యర్థన. దయతో ఈ రూమర్లకు ముగింపు పలకండి అంటూ చాహల్ కోరిన విషయం విధితమే. ధనశ్రీ వర్మ సైతం ఇలాంటి పుకార్లకు ముగింపు పలకాలని కోరింది.
తాజాగా తమపై వస్తున్న రూమర్స్ కు పూర్తిచెక్ పెట్టేందుకు ధన శ్రీ వర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోలో ధన శ్రీ మాట్లాడుతూ.. నేను ఒక నెల పాటు మా అమ్మవారింటికి వెళుతున్నాను అని చెబుతుంది. దీంతో టీవీ చూస్తున్న చాహల్ తన చేతిలోని రిమోట్ ను ఒక్కసారిగా పక్కకు విసిరేసి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. పక్కనే కూర్చున్న ధనశ్రీ చాహల్ చేస్తున్న డ్యాన్స్ ను చూసి నవ్వులు చిందిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
