Crocodile Angry: వామ్మో.. మొసలికి కోపమొచ్చింది.. వ్యక్తిని ఎలా ఉరికించిందో చూడండి.. వీడియో వైరల్

మొసలికి కోపమొచ్చింది.. ఇంకేముంది.. ఎన్‌క్లోజర్‌లో ఉన్న వ్యక్తిని పరుగులు పెట్టించింది.. వేగంగా దూసుకొచ్చిన మొసలిని చూసి సదరు వ్యక్తి భయంతో పరుగు లంకించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Crocodile Angry: వామ్మో.. మొసలికి కోపమొచ్చింది.. వ్యక్తిని ఎలా ఉరికించిందో చూడండి.. వీడియో వైరల్

Crocodile

Crocodile Angry: మొసలికి కోపమొచ్చింది.. ఇంకేముంది.. ఎన్‌క్లోజర్‌లో ఉన్న వ్యక్తిని పరుగులు పెట్టించింది.. వేగంగా దూసుకొచ్చిన మొసలిని చూసి సదరు వ్యక్తి భయంతో పరుగు లంకించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ  ఘటన యునైటెడ్ స్టేట్స్ లోని థీమ్ పార్క్, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆగస్టు 18న ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. 1.3 మిలియన్ల మంది వీక్షించారు. 7,500 మందికి పైగా నెటిజన్లు లైక్ లు చేశారు. పలువురు నెటిజన్లు కామెంట్లతో తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Viral Video: మన మధ్య గొడవొద్దు..! నీకు కొంచెం.. నాకు కొంచెం.. పిల్లుల ఐక్యత అదుర్స్..! వీడియో వైరల్‌

ఈ వీడియోలో చైన్సా అనే మొసలి భారీ కాయంతో ఉంది. ఇది ఎన్ క్లోజర్ లో ఉన్న వ్యక్తిని పరుగు పెట్టించింది. మొసలి ఒక్కసారిగా మీదకు దూసుకురావడంతో సదరు వ్యక్తి భయంతో పరుగు పెట్టాడు. ఈ వీడియోకు ‘చైన్సా ఇన్ యాక్షన్.. మా అమేజింగ్ క్యూబన్ మొసలి!’ అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్.. ఒక ఫ్లోరిడియన్‌గా ఇది నేను చూసిన అత్యంత భయానకమైన విషయం కావచ్చు అంటూ వ్యాఖ్యానించాడు.

Viral Video : కలెక్టర్ కళ్లద్దాలు ఎత్తుకెళ్లిన కోతి..లంచం తీసుకుని తిరిగి ఇచ్చింది

మరో నెటిజన్.. వావ్ … నేను ఇలాంటి మొసలిని ఎప్పుడూ చూడలేదు, వాస్తవానికి దాదాపు గ్యాలప్ రన్.. అమేజింగ్! అంటూ పేర్కొన్నాడు. “నేను దీన్ని చూడకుండా ఉండలేను! అదే సమయంలో నమ్మశక్యం కానిది, భయపెట్టేది! అంటూ మరో నెటిజన్  వ్యాఖ్యానించాడు.  క్యూబా మొసళ్ళు సాధారణంగా 10 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. వాటికి పొట్టి కాళ్లు ఉన్నప్పటికీ వేగంతో పరిగెత్తగలవు. అవి పరిగెత్తినప్పుడు 100 అడుగుల వరకు కవర్ చేస్తాయి. అయితే అవి త్వరగా అలసిపోతాయి.