Viral Video: మన మధ్య గొడవొద్దు..! నీకు కొంచెం.. నాకు కొంచెం.. పిల్లుల ఐక్యత అదుర్స్..! వీడియో వైరల్‌

మన ఇళ్లలో ఎక్కువగా కుక్క, పిల్లి పిల్లలను పెంచుకుంటుంటాం. ఒక్కో ఇంట్లో రెండు కుక్క, రెండు పిల్లి పిల్లలు ఉంటాయి. అలాంటి ఇంట్లో రోజూ వాటి మధ్య యుద్ధాలే జరుగుతుంటాయి.

Viral Video: మన మధ్య గొడవొద్దు..! నీకు కొంచెం.. నాకు కొంచెం.. పిల్లుల ఐక్యత అదుర్స్..! వీడియో వైరల్‌

Two Cats

Viral Video: మన ఇళ్లలో ఎక్కువగా కుక్క, పిల్లి పిల్లలను పెంచుకుంటుంటాం. ఒక్కో ఇంట్లో రెండు కుక్క, రెండు పిల్లి పిల్లలు ఉంటాయి. అలాంటి ఇంట్లో రోజూ వాటి మధ్య యుద్ధాలే జరుగుతుంటాయి. ఆహారం విషయంలో మరేదైన విషయంలో ఒకదానిపై ఒకటి సరదాగా పోట్లాడుకుంటుంటాయి. అయితే కొన్ని సార్లు మాత్రం వాటి మధ్య సంఖ్యత కుదిరి యాజమాని పెట్టిన ఆహారాన్ని షేరింగ్ చేసుకొని తింటుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Police Officer Dance Video: నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో

ఈ వీడియోలో రెండు పిల్లులు ఉన్నాయి. వాటి యాజమాని రెండు పిల్లులకు కలిపి ఒకే గిన్నెల్లో ఆహారాన్ని అందించాడు. ఈ సమయంలో ఆ రెండు పిల్లులు ఐక్యతను చాటుతూ ఒకదాని తరువాత ఒకటి తినడం మొదలు పెట్టాయి. తొలుత ఓ పిల్లి గిన్నెలో ఉన్న ఆహారాన్ని కొద్దిగా తీసుకొని మరో పిల్లికి ఇవ్వగా.. ఆ పిల్లి కొద్దిగా ఆరగించి మళ్లీ మొదటి పిల్లికి ఇచ్చింది.. ఇలా అవి రెండూ ఐక్యతను ప్రదర్శించి ఆహారాన్ని ఏం చక్కా తినేశాయి. పిల్లులు ఒకే గిన్నెలో ఆహారాన్ని ఎలాంటి గొడవ లేకుండా తినే వీడియోను ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయగా అది వైరల్ గా మారింది.

ఈ వీడియోను 33లక్షల మందికిపైగా వీక్షించారు. అనేక మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కలిసుంటే కలదు సుఖం అనేవిషయాన్ని ఈ పిల్లులు చక్కగా అర్థం చేసుకున్నట్లుయి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇలా ఐక్యతగా ఉంటే ఎవరికి ఏ నష్టం రాదుగా అంటూ మరో నెటిజన్ కామెంట్లు చేశాడు. ఈ పిల్లులు తెలివైనవి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపించారు.