Police Officer Dance Video: నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో

యూపీలోని కొత్వాలీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఇద్దరు పోలీసులు నాగిని నృత్యం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్ గా మారింది.

Police Officer Dance Video: నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో

Police Officer Dance Video

Police Officer Dance Video: గత రెండు రోజుల క్రితం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. యూపీలోని కొత్వాలీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఇద్దరు పోలీసులు నాగిని నృత్యం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్ గా మారింది. జైకీ యాదవ్ అనే ట్వీటర్ యూజర్ ఈ వీడియోను పోస్టు చేయగా.. అది తెగ వైరల్ అవుతోంది. సుమారు 75వేల మందికి పైగా నెటిజన్లు వీడియోను వీక్షించారు.

World Most Polluted Cities: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్‌లోని ఆ రెండు నగరాలు..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సాధారణంగా పోలీసులు యూనిఫాంలో ఇలా డ్యాన్స్ చేయకూడదు. కానీ, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసులు కూడా తమ భావోద్వేగాలను ఆపుకోలేక పోలీస్ స్టేషన్‌లో నాగిని డ్యాన్స్ తో రెచ్చిపోయారు. ఓ ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఈ డ్యాన్స్ చేస్తుండగా, చుట్టూ నిలుచున్న పోలీసులు వారిని చప్పట్లతో ఉత్సాహపరుస్తున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు రీ కామెంట్లు చేస్తున్నారు.

Kabul mosque attack: అఫ్గాన్‌లో బాంబు పేలుళ్ళు.. 20 మంది మృతి.. 40 మందికి గాయాలు

అధికశాతం మంది నెటిజన్లు ఈ వీడియోకి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇలాంటివి పోలీసులపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. పోలీసులు కూడా కొన్ని సార్లు కాలుకదపడం వల్ల ఎవరకీ నష్టం లేదని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఈ పోలీసులు మల్టీ ట్యాలెంటెడ్ అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. అయితే కొద్దిమంది మాత్రం యూనిఫాంలో పోలీసులు ఇలా చేయడం సరికాదని, అదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇలా ప్రవర్తించడం సరియైంది కాదని తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు. ఈ విషయంపై పురాన్‌పూర్ పోలీసు సిబ్బంది వీరేంద్ర విక్రమ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ యూనిఫాంలో ఇద్దరు పోలీసులు చేసిన డ్యాన్స్ వీడియోపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులను రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.