Dhanush-Vishal-Suriya : అక్కడ స్పేస్ లేదు.. కానీ వాళ్లు క్రియేట్ చేస్తున్నారు..
తమిళ హీరోలు తమకు తాము పొలిటికల్‌గా టెస్ట్ చేసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి గ్రౌండ్‌లో బలపడితే ఎన్నికల నాటికి ఎంతో కొంత వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నారు.
- Sreehari A
- Updated on- July 28, 2026 / 08:21 PM IST
Dhanush, Vishal And Suriya Political Entry
- పొలిటికల్‌గా టెస్ట్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న హీరోలు
- ఫ్యాన్స్ సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలంటూ పిలుపు
- సూర్య, విశాల్, ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు టాక్
Dhanush-Vishal-Suriya : ఈ ఫేమస్ డైలాగ్ వినగానే మీకు ఠక్కున డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తుకొస్తారు. కానీ, ఈ స్టోరీ మాత్రం త్రివిక్రమ్ గురించి కాదు. తమిళ హీరోల గురించి. తమిళనాట దళపతి విజయ్ సృష్టించిన ప్రభంజనం చూసిన తర్వాత హీరోలు కూడా తమకు తాము పొలిటికల్ గా టెస్ట్ చేసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి గ్రౌండ్ లో బలపడితే ఎన్నికల నాటికి ఎంతో కొంత వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నారు.
అసలు స్టోరీలోకి వస్తే తాజాగా ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ తో మాట్లాడారు. తన ఫ్యాన్స్ సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని, గ్రామాల్లోకి వెళ్లి ప్రజల అవసరాలు తెలుసుకుని వాళ్ల అవసరాలు తీర్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయితే, ధనుష్ ఇదేం ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం లేదు. కొన్నాళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే, ఈసారి కొంచెం పెంచడానికి ప్లాన్ చేశారు.
ఆ వెంటనే విశాల్ కూడా సీన్ లోకి ఎంటరయ్యారు. ఇన్నాళ్లూ తాను సినీ ఇండస్ట్రీలో తెచ్చుకున్న మంచి పేరును ఇక నుంచి ప్రజల సేవకు ఉపయోగిస్తానని ప్రకటించారు. అంటే, పరోక్షంగా తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని సిగ్నల్ ఇచ్చారు. ‘ఇకపై నా జర్నీ మామూలుగా ఉండదు. నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తా. మీకు అండగా ఉంటా’ అని విశాల్ ప్రకటించడంతో పొలిటికల్ ఎంట్రీ కన్ ఫాం అయిపోయింది.
మరోవైపు సూర్య కూడా పొలిటికల్ గా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు ఆయన సినిమాలను బట్టి చూస్తే కనిపిస్తుంది. గతంలో విజయ్ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేశాడు. మొదట హీరోయిజం సినిమాలు చేసిన విజయ్.. ఓ పదేళ్ల పాటు సోషల్ మెసేజ్ ఉండే మూవీస్ ను సెలక్ట్ చేసుకుని మరీ వాటిలోనే యాక్ట్ చేశాడు. అంటే, ఓ రకంగా నేరేటివ్ బిల్డ్ చేశాడు. ఆ ప్రకారం చూస్తే సూర్య కూడా పొలిటికల్ గా మైలేజ్ కోసం అలాంటి స్క్రిప్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది.
గతంలో మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన యువతో మొదలు పెడితే తాజాగా వస్తున్న సినిమాలు NGK, జై భీమ్, సూరారై పోట్రు, రాకెట్రీ, కరుప్పు, కరుప్పు సీక్వెల్ అయితే ఫుల్ పొలిటికల్ సినిమాలా డిజైన్ చేసినట్టు కరుప్పు ఎండింగ్ లోనే లీడ్ ఇచ్చాడు. దీన్నిబట్టి సూర్య ఇప్పుడు కాకపోతే కొన్నాళ్లు ఆగినా రాజకీయాల్లోకి రావడం మాత్రం కన్ ఫాం అనేలా ఉంది.
ఇక అజిత్ విషయానికి వస్తే విజయ్ తో పోటా పోటీ క్రేజ్ ఉన్న హీరో అతనే. కానీ, అజిత్ కి అన్నాడీఎంకేతో సత్సంబంధాలు ఉన్నాయి. అజిత్ కరెక్టుగా ప్లాన్ చేసుకుంటే అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడం చాలా సులభం. జయలలిత తర్వాత ఫేమ్ ఉన్న లీడర్ లేకపోవడం అన్నాడీఎంకేకి మైనస్.
Read Also : Sonam Wangchuk : విజయంతో పాటు వినయం కూడా ఉండాలి : సీజీపీ సంబరాలపై సోనమ్ వాంగ్‌చుక్ హితవు!
అజిత్ రంగంలోకి దిగితే ఆల్రెడీ కేడర్ ఉన్న పార్టీ కాబట్టి ఆయన కొంచెం పుష్ చేస్తే పవర్ లోకి రావడానికి చాన్స్ ఉంటుంది. అయితే, అజిత్ మనసులో ఏముందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు అజిత్ తో విజయ్ మంచి సంబంధాలే మెయింటెయిన్ చేస్తున్నాడు. ఈ మధ్య అజిత్ తండ్రి చనిపోతే విజయ్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించాడు. ఇప్పటికైతే ఇద్దరి మధ్య బానే ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లిద్దరి ఫ్యాన్స్ ఫైటింగ్ వేరే లెవల్.
వీళ్లే కాదు. తమిళనాడులో చాలా మంది హీరోలు సామాజిక సేవ చేస్తుంటారు. చాలా మంది పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా ఉంటారు. విశాల్ తో పాటు చాలా మంది హీరోలు విజయ్ కు సపోర్టుగా మాట్లాడారు. అసలు తమిళనాడులో సినిమాలు, రాజకీయాలను వేరు చేసి చూడలేం. పైన చెప్పిన వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది సినీ నటులు, (శివ కార్తికేయన్, లారెన్స్ లాంటి వాళ్లు) టెక్నీషియన్స్ కూడా పొలిటికల్ గ్రౌండ్ లో తమ లక్ ట్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.
అసలు అంత స్పేస్ ఉందా?
ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే చెప్పలేం. గతంలో ద్రవిడ పార్టీల పోరు నడిచింది. అయితే డీఎంకే, లేకపోతే అన్నాడీఎంకే. కానీ ఇన్నేళ్లకి మూడో ప్రత్యామ్నాయం వచ్చింది. రేపు మన లక్ కూడా వర్కవుట్ కావొచ్చేమో అనే ప్లాన్ అందరిలోనూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈక్వేషన్స్ మారితే కింగ్ మేకర్ అయినా చాలులే అనే ఐడియా కూడా చాలా మంది హీరోల్లో ఉండొచ్చు.
లక్ కలిసొస్తే గతంలో కర్ణాటకలో కుమారస్వామి తరహాలో సీఎం సీటు దక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గతంలో విజయ్ కాంత్ ఓ సారి ట్రై చేశారు. డీఎండీకే పార్టీ ద్వారా కొంత మైలేజ్ వచ్చింది. కానీ, ఆ తర్వాత ఆ ఫామ్ కంటిన్యూ కాలేదు. మొత్తానికి అక్కడ స్పేస్ ఉందా లేదా అనేది చూడకుండా తమకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు తమిళ హీరోలు.
